ఆత్మహత్యా ? హత్యా ? | Suicide? Murder? | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యా ? హత్యా ?

Published Sat, Sep 20 2014 2:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Suicide? Murder?

  • పెడనలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన యువతి మృతదేహం వెలికితీత
  •  శ్మశానంలోనే పోస్టుమార్టం
  • పెడన : పట్టణంలో బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతి మృతదేహాన్ని శుక్రవారం శ్మశానవాటికలో వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. స్థానిక ఎనిమిదో వార్డుకు చెందిన ఆర్‌ఎంపీ సంగాబత్తుల రెడ్డయ్య కుమార్తె ధన్వంతరీదేవి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యా ? అన్న విషయమై పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆమెది ఆత్మహత్య కాదని, తండ్రి, సోదరుడు హత్య చేసి గుట్టుచప్పుడు కా కుండా ఖననం చేశారని మృతురాలి అమ్మమ్మ పొలన శేషారత్నం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఈ మేరకు ఎస్సైలు దుర్గాప్రసాద్, మణికుమార్ కేసు నమోదు చేశారు. శుక్రవారం వారు తహశీల్దార్, మండల మేజిస్ట్రేట్ డి.వి.ఎస్.ఎల్లారావును కలిసి శేషారత్నం దాఖ లు చేసిన ఫిర్యాదును అందజేశారు. యువతి మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎల్లారావు అనుమతి ఇచ్చారు. శ్మశానవాటికలో పంచనామా అనంతరం తహశీల్దార్, ఎస్సైలు, మృతురాలి తండ్రి రెడ్డయ్య, అన్న తులసేశ్వరరావు, అమ్మ మ్మ శేషారత్నం, గూడూరు మండలం రాయవరం సర్పంచ్ శ్రీనివాసరావు, బంధువుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంత రం మృతదేహాన్ని ఖననం చేశారు.
     
    పొలం కోసమే చంపారంటున్న మృతురాలి అమ్మమ్మ
     
    రెడ్డయ్యకు రెండు వివాహాలయ్యాయి. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. భర్తతో గొడవల నేపథ్యంలో ఆమె విడిపోయి ఘంటసాలలో ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్డయ్య గూడూరు మండలం రాయవరానికి చెందిన పొలన శేషారత్నం నలుగురు కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకున్నాడు.

    రెండో భార్య కుమారుడు తులసేశ్వరరావు గూడూరు మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె ధన్వంతరీదేవి మచిలీపట్నంలో ఏఎన్‌ఎం, ప్రైవేటుగా డిగ్రీ చదివి కొంతకాలం నర్సుగా పనిచేసింది. గత ఏడాది తల్లి మృతి చెందడంతో అప్పటినుంచి ఇంటివద్దనే ఉంటోంది. ఈమె అమ్మమ్మ శేషారత్నానికి చెందిన 1.24 ఎకరాల పొలం, నాలుగున్నర సెంట్ల ఇంటి స్థలాన్ని రెండేళ్ల కింద ట రెడ్డయ్య తన రెండో భార్య పేరిట రాయిం చుకున్నాడు.

    పొలంలో తమకు కూడా వాటా వస్తుందంటూ శేషారత్నం మిగతా ముగ్గురు కు మార్తెలు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. 1.24 ఎకరాల పొలం ధన్వంతరీదేవికి దక్కకుండా చేసేం దుకే ఆమెను తండ్రి, సోదరుడు చంపి ఉంటారని శేషారత్నం ఆరోపిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు  ఆధారంగా ఈ కేసుపై తదుపరి చర్య లు తీసుకుంటామని ఎస్సైలు తెలిపారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement