కాలినడకన తిరుమలకు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు బుధవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల చేరుకునేందుకు కాలిబాటన నడకను ప్రారంభించారు.
తిరుమలలో రేపు ప్రధాన న్యాయమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగత పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి.