శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ గొగోయ్‌ దంపతులు | Supreme Court Judge Justice Ranjan Gogoi Visit Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ గొగోయ్‌ దంపతులు

Published Sat, Nov 16 2019 8:12 PM | Last Updated on Sat, Nov 16 2019 8:27 PM

Supreme Court Judge Justice Ranjan Gogoi Visit Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దంపతులు శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ పాల్గొన్న గొగోయ్‌ దంపతులు, అనంతరం తిరు మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవను తిలకించారు. క్షేత్ర సాంప్రదాయ ప్రకారం భూ వరాహ స్వామిని దర్శించుకున్న గొగోయ్‌ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement