
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా ట్రిబ్యునల్ నదీపరివాహం గల నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని సుప్రీంకోర్టులో ఇటీవల ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. నాలుగు రాష్ట్రాలు కాకుండా తెలుగు రాష్ట్రాల వాదనలు సరిపోతాయన్న ట్రిబ్యునల్ తీర్పును న్యాయస్థానం సమర్థించింది.
గతంలో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కోర్టు నిర్ణయంతో కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు యధావిధిగా కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment