![SV krishna Reddy Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/27/sv-krishna-reddy.jpg.webp?itok=cgrszgpG)
విజయనగరం, బొబ్బిలి: జిల్లాలో జరుగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఎల్.కోట మండలంలో బుధవారం జరిగిన యాత్రలో వారు జగన్‌తో కలిసి అడుగులు వేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ప్రసార మాధ్యమాల్లో చూసి ముచ్చటపడి జగన్‌ను ఎలాగైనా కలిసి పాదయాత్రలో తాను భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో వచ్చానని చెప్పారు. మూడు వేల కిలోమీటర్లు దాటి పాదయాత్ర చేయడం పట్ల హేట్సాప్ చెప్పారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజల అండదండలతోనే ఇది సాధ్యమైందని, జగన్ కూడా అంతే సంకల్పంతో ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment