►రెండువారాలల్లో పంటల బీమా వర్తింపు
►ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి స్పష్టం చేసిన ఏఐసీ సీఎండీ
►2012 నుంచి ఎదురుచూస్తున్న రైతన్నలు
సాక్షి ప్రతినిధి, కడప : రెండేళ్లుగా ఎదురుచూస్తున్న రైతన్నలకు త్వరలో తీపి కబురు అందనుంది. రబీ పంటలకు పంటల బీమా చేసిన రైతులకు ఇన్సూరెన్సు కంపెనీ చెల్లింపులు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఆమేరకు ఏఐసీ సీఎండీ జోసెఫ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలిపారు. ఇదివరకే ఆయన రెండు పర్యాయాలు పంట ల బీమా విషయమై సీఎండీతో స్వయం గా చర్చించారు. న్యూడిల్లీలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం మరోమారు సీఎండీతో 2012 రబీ పం టల బీమాపై చర్చించారు. పొద్దుతిరుగుడు, శనిగ పంటలకు చెందిన సుమా రు 80 వేల మంది రైతులు రూ.8.57 కోట్లు ప్రీమియం చెల్లించారని తెలపా రు. రెండేళ్లుగా ఎదురుచూపులే మినహా పంటల బీమా రైతులకు అందలేదని సీఎండీకి వివరించారు. ఇప్పటికే తాను సైతం రెండు పర్యాయాలు స్వయంగా వివరించానని గుర్తు చేశారు. ఇన్సూరెన్సు కంపెనీని రైతన్నలు ఆపద కోస మే ఆశ్రయించారని తెలిపారు.
రెండేళ్లు పూర్తి అయినా బీమా దక్కకపోవడం, ఇప్పటికీ జాప్యం చేయడం తగదని వివరించారు. స్పందించిన సీఎండీ రెండు లేదా మూడు రోజుల్లో రాష్ట్ర ఇన్సురెన్స్ కార్యాలయం నుంచి తుది నివేదికలు ఏఐసీ కార్యాలయానికి చేరుతాయని తెలిపారు. వాటిని పరిశీలించి వారం లేదా పది రోజులకు మంజూరు చేస్తామని, ఈమారు జాప్యం అయ్యే అవకాశం లేదని తెలిపారు. ఇంకో రెండు వారాల్లో 2012 రబీ పంటలకు చెందిన ఇన్సూరెన్సు రైతన్నలకు దక్కనుంది. ఆ మేరకు న్యూఢిల్లీ నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షికి ఫోన్‌లో ధ్రువీకరించారు.
రైతన్నలకు తీపి కబురు!
Published Tue, Feb 17 2015 1:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement