సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు చెల్లించిన పంటల బీమాలకు సంబంధించిన పరిహారం సొమ్ము విడుదలైంది. మొత్తం 1.95 లక్షల మంది రైతులకు రూ. 158.58 కోట్లు పరిహారంగా చెల్లించాలని పలు బీమా కంపెనీలు తేల్చాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద రూ. 95.25 కోట్లు, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద రూ. 63.33 కోట్లు ఇవ్వనున్నారు. సొమ్మును వచ్చే నెల 9వ తేదీలోగా రైతులకు చెల్లించాలని వ్యవసాయశాఖ బుధవారం ఆదేశించింది. ఈ మేరకు కంపెనీలు, అధికారులతో ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సమీక్ష నిర్వహించారు.