
'వీహెచ్... ఓ కుప్పిగంతుల హన్మంతు'
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావుపై చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ శనివారం విజయవాడలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రేతాయుగంలో రామభక్తుడు హన్మంతుడు భగవంతుడైతే నేటి హన్మంతరావు రాక్షసుడని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కుప్పిగంతులు వేసే హన్మంతరావుకు లేదన్నారు.
తమకు ఉరిశిక్ష వేసి అసెంబ్లీ చర్చ పెట్టమనడం పాల్గొనమనడం అన్యామన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు అన్యాయం జరిగిందన్నారు. తాము ఇప్పటికి సమైక్య తీర్మానంపై ఓటింగ్కు కట్టుబడి ఉన్నామని టి.జి.వెంకటేష్ స్పష్టం చేశారు.