- నలుగురు డెరైక్టర్లు ఏకగ్రీవం
- 11 సెగ్మెంట్లకు పోటీ
- పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
- ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్
- సాయంత్రం ఓట్ల లెక్కింపు
పాయకరావుపేట: తాండవ చక్కెర కర్మాగారం పాలక వర్గం ఎన్నికలు మంగళవారం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ్యాక్టరీ పరిధిలో 15 డెరైక్టర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. కొడవటిపూడి సెగ్మెంట్‌కు ఆనాల సత్యనారాయణ, డి.పోలవరం సెగ్మెంట్‌కు సుర్లలోవరాజు, చినబొడ్డేపల్లికి అల్లూరి సూర్యనారాయణరాజు,ఎస్‌ఆర్‌పేటకు లాలం బాబ్జీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగిలిన 11నియోజకవర్గాల డెరైక్టర్ పదవులకు 23 మంది బరిలో ఉన్నారు. పాయకరావుపేట సెగ్మెంట్‌కు కంద నూకరాజు,నాగం వెంకటవాసు దొరప్ప,పెదరామభద్రపురానికి మందపాటి శ్రీనివాసరాజు, చెక్కల వెంకటరమణ,గిడజాంకు కాట్రెడ్డి రాంబాబు,బలిజ సత్యన్నారాయణ, పి.రామకృష్ణ, కోటేశ్వరరావు,సుబద్రయ్యమ్మపేటకు బి. నాగేశ్వరరావు, వేగి తులసీరావు, ఎన్.ఎస్. వెంకటనగరానికి చిట్టుమూరి సత్యన్నారాయణ,మోర్త కృష్ణ,పి.కొట్టాంకు తోలెం రాజులు, సాలాది దేముడు, గుమ్మిడిగొండకు కురపల్లి పోతురాజు, రేగాటి సత్తి బాబు, నర్సీపట్నానికి కలిమి శ్రీను, కె,కన్నయ్యనాయుడు, కోటనందూరుకు కె.నాగేశ్వరరావు,జి. జగ్గునాయుడు, బొద్దవరానికి యల్లపు రమణ,వేగి గౌరినాయుడు, వర్క్‌మెన్ గ్రూపు నుంచి కర్రి వెంకటేశ్వరరావు, కొల్లు సురేంద్ర కుమార్ డైరక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు.
పోలింగ్ కేంద్రాలివే....
11సెగ్మెంట్ల డెరైక్టర్ల ఎన్నికకు 4వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బి. మోషా తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ప్యాక్టరీ ఆవరణకు తరలించాక లెక్కింపు చేపడతారు.