- వాణిజ్య పన్నుల శాఖలో ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ పటిష్టానికి సర్కారు చర్యలు
- వసూలైన పన్నులో 10 శాతం నజరానా
సాక్షి, హైదరాబాద్: లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తూ వాణిజ్యపన్నుల శాఖకు పైసా చెల్లించకుండా పన్ను ఎగవేస్తున్న వ్యాపారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించిం ది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 10 రోజులే గడువున్న నేపథ్యంలో వీలైనంత మేరకు అధిక మొత్తంలో పన్నులు రాబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంటు వ్యవస్థను పటిష్టం చేసిన వాణిజ్యపన్నుల శాఖ, ఇన్‌ఫార్మర్లకు భారీగా నజరానాలు ఇచ్చి ఎగవేతదారుల సమాచారం సేకరించాలని నిర్ణయిం చింది.
ఇందుకోసం సమాచారం ఇచ్చే ఇన్‌ఫార్మర్ల పారితోషికాన్ని కూడా పెంచింది. ఇన్‌ఫార్మర్ల వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. పన్ను ఎగవేతదారుల సమాచా రం అందించిన వారికి గతంలో వసూలైన పన్నులో 10 శాతం గానీ, గరిష్టంగా రూ.10 వేలుగాని చె ల్లించేవారు. అయితే ఈసారి వసూలైన పన్నులో 10 శాతం గానీ, గరిష్టం గా రూ.50 వేలు గాని చెల్లించేలా సవరణ చేశారు.
మాజీ ఉద్యోగుల నుంచి సమాచార సేకరణ
హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించకుండా ప్రతిరోజు లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నవారు వేల సంఖ్యలోనే ఉన్నారని సర్కారు గుర్తించింది. అలాగే జీరోనంబర్ దందా ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు సాగుతున్నాయి. ఇలాంటి సంస్థలు, ఏజెన్సీలలో పనిచేసి మానేసిన వారికి అక్కడ జరుగుతున్న వ్యాపారం గురించి సమాచారం తెలిసుంటుం ది. అలాగే ఒక సంస్థ చేసే వ్యాపారం గురించి పోటీదారులకు కూడా అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో వారినే లక్ష్యంగా చేసుకొని ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పటిష్టం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏసీటీవో నుంచి కమిషనర్ స్థాయి అధికారుల ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.