Informer system
-
అనుమానాస్పద పార్శిళ్లపై నజర్
పోస్టల్, నిఘా సంస్థలతో కలసి సిట్ పటిష్ట నిఘా - కార్గో ద్వారా వచ్చే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థ - సినీ ప్రముఖులకు వస్తున్న కొరియర్లపై ఆరా - రామానాయుడు స్టూడియోలో తనిఖీ - పార్శిల్లో వెన్నునొప్పి పరికరం ఉండటంతో వెనుదిరిగిన అధికారులు సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పలువురికి నోటీసులిచ్చి విచారణ పూర్తి చేసిన సిట్ తాజాగా అనుమానాస్పద పార్శిళ్లపై దృష్టి సారించింది. పోస్టల్, కొరియర్ సంస్థల ద్వారా వస్తు న్న అనుమానిత పదార్థాలు, వస్తువులు కస్టమర్లకు చేరుతున్నట్లు గుర్తించింది. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ కూడా ఇలాగే సినీ ప్రముఖులతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు చేరాయని ఇప్పటికే ఆధారాలతో నిరూపించింది. దీనిలో భాగంగా పోస్టల్ శాఖ తో పాటు పలు ప్రముఖ కొరియర్ సంస్థలతో నిఘా పటిష్టం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలు చేపట్టామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. వివిధ దేశాల నుంచి విమాన సర్వీసుల్లోని కార్గోల ద్వారా వస్తున్న డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టపరుచుకున్నామని చెప్పింది. దీని నుంచి అందుతున్న సమాచారంతో మంగళవారం ముంబై నుంచి వచ్చిన దక్షిణాఫ్రికా వాసి నుంచి 10 గ్రాముల కొకైన్‌తోపాటు ఎల్ఎస్డీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని అధి కారులు తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్ట మ్స్, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటి క్ కంట్రోల్ బ్యూరో సహకారంతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే యోచనలో ఉన్నట్టు కీలకాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతామని తెలిపారు. డ్రగ్స్ కాదు.. వెన్నునొప్పి పరికరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో 3గంటల పాటు తనిఖీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ లు నిర్వహించారు. ఈ పార్శిల్లో వెన్నునొప్పికి సంబంధించిన పరికరం ఉందని ఇన్స్పెక్టర్ కనకదుర్గ తెలిపారు. అది తన కుమారుడు, హీరో రానాకు వచ్చిందని, అది వెన్నునొప్పికి సంబంధించినదని నిర్మాత సురేశ్‌బాబు వెల్లడించారు. -
టార్గెట్ టాప్ కేడరే!
అగ్రనేతలను మట్టుబెడితే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే యోచన - వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఎస్ఐబీ విభాగం - ఒక్కో కీలక నేత వేట కోసం ఒక్కో బృందం - ప్రధానంగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల సభ్యులపై దృష్టి - బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ.. భారీగా నజరానాలు సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోతోపాటు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని కీలక నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారా.. వారిని మట్టుబెట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారా.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. మావోయిస్టు అగ్రనేతల్ని హతమార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీ సులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉదయ్ సహా పలువురు కీలక నేతలు ఏవోబీలో ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి తెలుగువారు నేతృత్వం వహిస్తున్నట్లుగానే ఆ పార్టీ అగ్రనేతలను పట్టుకోవడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులదే కీలక భూమిక. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో మావోయిస్టు నేతలను అరెస్టు చేసినా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పోలీసుల పాత్ర ఉంటోంది. ఎస్ఐబీ కీలకం..: మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో గ్రేహౌండ్స్ పేరుగాంచిన విధంగానే సమాచార సేకరణలో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కీలకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టు పార్టీలోని మొదటి తరం నేతలను మట్టుపెట్టడం ద్వారా ఆ ఉద్యమాన్ని కూకటివేళ్లతో పెకలించవచ్చనేది ఎస్ఐబీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్లే మావోయిస్టు అగ్ర, కీలక నేతల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మావోయిస్టు పార్టీ రాజకీయ విభాగాలైన పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల్లో ఉన్న నేతల కోసం నిఘా పెట్టింది. ఒక మావోయిస్టు నేత కోసం ఏర్పాటు చేసిన బృందం ఆ నేత ఎన్కౌంటర్ అయ్యేవరకు ఆ ఒక్క పనిమీదే ఉంటోందని తెలుస్తోంది. ఎన్కౌంటర్ లేదా అరెస్టు జరిగితేనే ఆ ప్రత్యేక బృందం ఆపరేషన్ పూర్తయినట్లుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాల కారణంగానే పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారనే వాదన కూడా ఉంది. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ మావోయిస్టు నేతల వేటలో భాగంగా వారి షెల్టర్/శిక్షణ జోన్లుగా ఉన్న ప్రాంతాల్ని ఎస్ఐబీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని తెలిసింది. బలమైన ఇన్ఫార్మర్, కోవర్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలోనూ పోలీసులు సఫలమయ్యారు. షెల్టర్లు, శిక్షణ ప్రాంతాల్లోని నేతలను కలిసే కొరియర్లను గుర్తించడం ద్వారా నీడలా వెంబడిస్తున్నారు. ముఖ్య నేతల కదలికల సమాచారాన్ని ఇస్తున్న ఇన్ఫార్మర్లకు రూ.లక్ష నుంచి రూ.పది లక్షల దాకా నజరానా అందిస్తున్నారని తెలుస్తోంది. ఆయా విభాగాలను పర్యవేక్షించే కీలక అధికారులకు మినహా ఇన్ఫార్మర్ల సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీతో గతంలో సంబంధాలు కలిగి ఉన్న వారు, ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చిన్నచిన్న స్థాయిల్లో పనిచేస్తున్న వారు కూడా పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తుండడంతో నేతల కదలికలను పసిగట్టడం సులువవుతోంది. వీటన్నింటికీ మించి సాంకేతిక నిఘా కోసం ఎస్ఐబీ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ చర్యలన్నింటి ఫలితంగానే మావోయిస్టు పార్టీని వరుసగా దెబ్బకొడుతున్నారు. అరెస్టయిన కీలక నేతలు మావోయిస్టు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు కోబాడ్ గాంధీ అలి యాస్ అరవింద్, బి.ప్రసాద్‌సింగ్ అలియాస్ బాల్‌రాజ్, అమిత్ బాగ్చి అలియాస్ సుమితి, కేంద్ర కమిటీ సభ్యులు పంకజ్, బన్సీధర్ సింగ్ అలియాస్ చింతన్‌దా, తుషార్‌కాంత్ భట్టాచార్య, రాజిరెడ్డి అలియాస్ సత్త న్న, వారణాసి సుబ్రమణ్యం అలియాస్ శ్రీకాంత్. గత కొన్నేళ్లలో మరణించిన మావో అగ్ర నేతలు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, వడ్కాపూర్ చంద్రమౌళి, సందె రాజమౌళి, కిషన్‌జీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్‌రెడ్డి అలియాస్ రమణ. -
పన్ను ఎగవేతదారుల ఆటలు కట్టు!
వాణిజ్య పన్నుల శాఖలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ పటిష్టానికి సర్కారు చర్యలు వసూలైన పన్నులో 10 శాతం నజరానా సాక్షి, హైదరాబాద్: లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తూ వాణిజ్యపన్నుల శాఖకు పైసా చెల్లించకుండా పన్ను ఎగవేస్తున్న వ్యాపారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ఇన్ఫార్మర్ల వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించిం ది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 10 రోజులే గడువున్న నేపథ్యంలో వీలైనంత మేరకు అధిక మొత్తంలో పన్నులు రాబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంటు వ్యవస్థను పటిష్టం చేసిన వాణిజ్యపన్నుల శాఖ, ఇన్ఫార్మర్లకు భారీగా నజరానాలు ఇచ్చి ఎగవేతదారుల సమాచారం సేకరించాలని నిర్ణయిం చింది. ఇందుకోసం సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్ల పారితోషికాన్ని కూడా పెంచింది. ఇన్ఫార్మర్ల వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. పన్ను ఎగవేతదారుల సమాచా రం అందించిన వారికి గతంలో వసూలైన పన్నులో 10 శాతం గానీ, గరిష్టంగా రూ.10 వేలుగాని చె ల్లించేవారు. అయితే ఈసారి వసూలైన పన్నులో 10 శాతం గానీ, గరిష్టం గా రూ.50 వేలు గాని చెల్లించేలా సవరణ చేశారు. మాజీ ఉద్యోగుల నుంచి సమాచార సేకరణ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించకుండా ప్రతిరోజు లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నవారు వేల సంఖ్యలోనే ఉన్నారని సర్కారు గుర్తించింది. అలాగే జీరోనంబర్ దందా ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు సాగుతున్నాయి. ఇలాంటి సంస్థలు, ఏజెన్సీలలో పనిచేసి మానేసిన వారికి అక్కడ జరుగుతున్న వ్యాపారం గురించి సమాచారం తెలిసుంటుం ది. అలాగే ఒక సంస్థ చేసే వ్యాపారం గురించి పోటీదారులకు కూడా అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో వారినే లక్ష్యంగా చేసుకొని ఇన్ఫార్మర్ల వ్యవస్థను పటిష్టం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏసీటీవో నుంచి కమిషనర్ స్థాయి అధికారుల ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.