గుంటూరు, సాక్షి: జిల్లాలో 57 మండలాలకు సంబంధించి ఎంపీపీ, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 57 మండల పరిషత్ స్థానాలు ఉండగా, అందులో టీడీపీ 41 స్థానాలు, వైఎస్సార్ సీపీ 15 స్థానాలు కైవసం చేసుకున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గ ముప్పాళ్ళ మండల పరిషత్ ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలో చిలకలూరిపేట, గుంటూరు రూరల్ మండలాల్లో టీడీపీ నాయకుల ప్రలోభాలు, దౌర్జన్యాల కారణంగా మెజార్టీ పరంగా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఉన్నప్పటికీ ఒక్కో సభ్యుడు చొప్పున టీడీపీ వైపునకు వెళ్లారు. ఇక్కడ సరి సమానంగా ఎంపీటీసీలు ఉండటంతో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
అందులో గుంటూరు రూరల్ మండలం ఎంపీపీ స్థానం టీడీపీకి, ఉపాధ్యక్ష స్థానం వైఎస్సార్ సీపీకి దక్కాయి. అదేవిధంగా చిలకలూరిపేట మండలం మురికిపూడి ఎంపీటీసీని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్నికకు వచ్చే సమయంలో టీడీపీ సభ్యుల వెంట వచ్చిన శ్రీనివాసరావు లోపల వైఎస్సార్‌సీపీ వైపు చెయ్యి ఎత్తడంతో ఇరువురికి సమాన బలం ఉండటంతో ఎన్నికను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించారు. లాటరీలో ఎంపీపీ స్థానం టీడీపీ అభ్యర్థిని వరించింది. ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడింది.
వినుకొండలో వింత పరిస్థితి..
వినుకొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నా ఎంపీపీ పదవికి రిజర్వ్ అయిన ఎస్సీ మహిళా అభ్యర్థులెవ్వరూ విజయం సాధించకపోవడంతో ఇక్కడి ఎంపీపీ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గెలిచిన నడిగడ్డ ఎంపీటీసీ యాదగిరి రామయ్య ప్లేటు ఫిరాయించి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్సన్ పదవుల్ని గుంపగుత్తగా సాధించిన టీడీపీ వినుకొండ మండల పరిషత్‌లో పాగా వేసింది.
టీడీపీ 41.. వైసీపీ 15.. వాయిదా 1
Published Sat, Jul 5 2014 1:49 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement