ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఇబ్రహీంబాద్‌లో పాత కక్షలు పగడ విప్పాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో జూలై 23న ఇక్కడ ఇరువర్గాలు కొట్లాటకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రదేశిక ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఇరువర్గాల మధ్య కొట్లాటకు పరిస్థితి దారి తీసింది.
టీడీపీ వర్గానికి చెందిన వారు ముందస్తు ప్రణాళికతో శ్లాబ్ టెర్రాస్‌లపై రాళ్లు, సీసాలు ఉంచుకొని ఒక్కసారిగా దాడి చేయటంతో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ప్రాణ భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ దాడిలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన సనపల గోవిందరావు, ద్రోణాచార్యులు, పోలినాయుడు కొండలరావు, సూర రామారావు, వెంకట రమణ, కిల్లి నర్సింగరావు తదితరులు గాయపడ్డారు.
వైఎస్‌ఆర్ సీపీ తరఫున జెడ్పీ మాజీ విప్ సనపల నారాయణరావు, టీడీపీ తరఫున మాజీ సర్పంచ్, ఆర్టీసీ కండక్టర్ సీపాన ఎర్నన్నాయుడు భార్య పద్మావతి ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు. మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామం కావటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా 107 కేసులు కూడా ఇరువ ర్గాలపై పెట్టారు.
గత పంచాయతీ ఎన్నికల్లో సనపల నారాయణరావు భార్య ఇందిర సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇబ్రహింబాద్, పూడివలస గ్రామాలు ఈ టీసీ పరిధిలోకి వస్తాయి. టీసీ వైఎస్ ఆర్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ నాయకులు కూడా పావులు కదుపుతున్నారు.
శుక్రవారం పోలింగ్ ముగియనున్న సమయంలో టీడీపీ వర్గీయులు ముందస్తు ప్రణాళికతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది ప్రధాన వీధిలో ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ నేపథ్యలో శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసులు గ్రామంలో పికెట్ నిర్వహించారు.
ప్రధాన వీధిలో వైఎస్‌ఆర్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తుండటంతో పొలాల గుండా పోలింగ్ స్టేషన్‌లోని బ్యాలెట్ బాక్సులను అధికారులు తరలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసుల గుప్పిట్లో ఉంది. శాంతి భద్రతులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్రిస్తున్నారు.
గాడు పేట,ఎచ్చెర్ల గ్రామాల్లో కొట్లాట
ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా కొత్తపేట పంచాయతీ కోదువాని పేట, ఎచ్చెర్లలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. కోదువానిపేటలో నలుగురికి, ఎచ్చెర్లలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. పొన్నాడ పంచాయతీ బింగి పేటలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు.
ఇబ్రిహీంబాద్‌లో ఉద్రిక్తత!
Published Sat, Apr 12 2014 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement