అధికార పార్టీ నేత అండతో బాల్య వివాహం | tdp Party leader Encouraged Child marriage | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేత అండతో బాల్య వివాహం

Published Sun, Aug 24 2014 1:32 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM

అధికార పార్టీ నేత  అండతో బాల్య వివాహం - Sakshi

అధికార పార్టీ నేత అండతో బాల్య వివాహం

 విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహాన్ని అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే దగ్గరుండి మరీ ఆ వివాహాన్ని ప్రోత్సహించారు. ఈ విషయం తెలిసిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు వివాహాన్ని ప్రొత్సహించిన వారిపైన, చేసుకున్న వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉ న్నతాధికారులకు విన్నవించినా.. ప్ర యోజనం లేకుండాపోయింది. వరుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడం తో పోలీసులు సైతం చేతులు ఎత్తేసారు.
 
 గంట్యాడ మండల కేంద్రానికి చెం దిన ఓ యువకునికి అదే గ్రామానికి చెం దిన 17 ఏళ్ల బాలికతో ఈనెల 19వ తేదీ న వివాహాం చేయాలని ఇరువురు తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే ఈ విషయాన్ని అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో హైదరాబాద్ చైల్డ్‌లైన్ ప్రతినిధులకు సమాచా రం అందించారు. వారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజయనగరం చైల్‌లైన్ సిబ్బందిని ఈనెల 9వ తేదీన ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బాలికకు 17 ఏళ్ల 6 నెలల వయస్సు అని నిర్ధారించారు. ఈ మేరకు వివాహాన్ని నిలపుదల చేయాలని ఈ నెల 13వ తేదీన గంట్యాడ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
 
 అయితే ఈ విష యం తెలుసుకున్న వధువు, వరుడు తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా అన్నవరం దేవస్థానంలో పెళ్లి జరిపించి నట్టు సమాచారం. అదే రోజు సంబంధి త సీడీపీఓ, తహశీల్దార్‌కు చైల్డ్‌లైన్ ప్రతి నిధులు సమాచారం అందించారు.  ఫిర్యాదు అందుకున్న వెంటనే గంట్యాడ పోలీసులు బాల్య వివాహం చేసిన వారి గురించి ఆరా తీస్తుండగా అధికార పార్టీ కి చెందిన ఓ ముఖ్యనేత పోలీసులకు ఫోన్ చేసి, వారి జోలికి వెళ్లొద్దని ఆదేశిం చినట్టు సమాచారం. దీంతో పోలీసులు మిన్నుకుండిపోయారు. ఇదే విషయమై చైల్డ్‌లైన్ ప్రతినిధులు కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. వాస్తవానికి
 
 చట్టరీత్యా నేరం :
 వాస్తవానికి ఆడ పిల్లలకు 18 ఏళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహా ం చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ ఎవరైనా బాల్య వివాహాం చేస్తే చట్టం ప్రకారం రెండేళ్లు జైలు శిక్ష లేదా రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. దీనికి బెయిల్ కూడా ఉండదు. బాల్య వివాహా నికి అనుమతి ఇచ్చినా, ప్రోత్సహించి నా, వివాహాన్ని నిర్వహించినా, జరగడానికి సహాకరించినా, బాల్య వివాహానికి హాజరైనా నిందుతులుగా పరిగణిస్తారు. ఈ విషయమై గంట్యాడ ఎస్‌ఐ షరీఫ్‌ను ‘సాక్షి’వివరణ కోరగా బాల్య వివాహాం గురించి చైల్డ్‌లైన్ ప్రతి నిధులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవ మే నని చెప్పారు.
 
 అరుుతే వివాహాం జరిగిపోయినట్టు తన కు తెలియదన్నారు. వధువు, వరుడు తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపడతామని తెలిపారు. ఐసీడీఎస్ పీడీ టివి. శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, బాల్య వివాహాల నిలుపుదల అధికారికి కేసును అప్పగించామని చెప్పారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement