అనంతపురం క్రైం : టీడీపీ జడ్పీ చైర్మన్‌గా దూదేకుల చమన్‌సాబ్ ఎన్నికైన సందర్భంగా శనివారం సాయంత్రం అనంతపురంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో బాణాసంచా పేలుళ్లలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి బాబయ్య, ఓ దినపత్రిక (సాక్షి కాదు) యాడ్ ఇన్‌చార్జ్ ఏ.బాబు, ఆయిల్ మిల్ యజమాని ఓబులేసు తీవ్రంగా, మరో ముగ్గురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు స్థానికంగా ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ కార్యకర్త అత్యుత్సాహంతో టపాసుల సరాలకు నిప్పంటించి జనంలోకి విసరడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
‘మేము రోడ్డు పక్కన నిలుచుని ఉన్నాం. ర్యాలీ మునిసిపల్ సర్కిల్ వద్దకు రాగానే ఓ కార్యకర్త టపాసుల సరానికి నిప్పంటించి జనంపైకి విసిరారు’ అని బాధితులు తెలిపారు. జనం గుంపులుగా ఉండడంతో తప్పించుకోలేకపోయామని వాపోయారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లినట్లు వైద్యులు చెప్పారు. బాధితులను టీడీపీ నేత, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్‌మహ్మద్ పరామర్శించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
టీడీపీ విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి
Published Sun, Jul 6 2014 2:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement