ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం పెద్దఅలవలపాడులో రేషన్ షాపు డీలర్ తమ పార్టీ కార్యకర్తకే చెందాలని టీడీపీ కార్యకర్తలు పట్టుబట్టారు. అది ఎలా సాధ్యమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యానికి దిగి...కర్రలతో దాడి చేశారు.
ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్యకర్తలు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ఒకరు మరణించారని ఒంగోలులో వైద్యులు వెల్లడించారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.