వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తూర్పు కంభంపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు ఆదివారం దాడికి దిగారు. ఆ దాడిలో ముగ్గురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి దిగారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు మాత్రం స్పందించలేదు. దాంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.