సాక్షి, విజయవాడ : విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోందని, లాక్ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే.. ఈనాడు దినపత్రికలో 15 వరకు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొత్త టారీఫ్ చార్జీలుపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది.
ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి. అలాగే సోషల్ మీడియాలో కరెంట్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయి. టీడీపీ హయాంలో స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులో గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. భారత దేశంలో స్టాటిక్ పద్ధతి వాడటం లేదు. స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు. ఏపీ ఈఆర్సీ డైనమిక్ పద్ధతి అమలులోకి తీసుకు వచ్చాం.200 యూనిట్లు లోపు వాడితే దేశంలో తక్కువగా విద్యుత్ ఇస్తోంది. పవర్ పర్చేజ్ బకాయిలు 4900 కోట్లు 2014 లో ఉంటే.. 2019 నాటికి 20వేల కోట్లు బకాయిలుకు చేర్చారు.
బకాయిలు 5వేల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. 7120 పైగా కోట్లు 5వేల కోట్లు డిస్కంలకు చెల్లించాం. 2014లో యూనిట్ 4.33 పైసలకు కొనుగోలు చేస్తే టీడీపీ హయాంలో 2019లో యూనిట్ 6 రూపాయలకు పెంచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్ తగ్గించాం. జెన్‌కోకు టీడీపీ హయాంలో 11వేల కోట్లు బకాయిలు ఉంటే 7 వేల కోట్లు మేము అధికారంలోకి రాగానే చెల్లించాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినవి అన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. రెండు సంవత్సరాలు బిల్లులను ఆన్ లైన్‌లో ఉంచుతున్నాం.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment