విధులు బహిష్కరించిన న్యాయవాదులు | Telangana advocates to boycott courts | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Published Thu, Sep 12 2013 1:37 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

Telangana advocates to boycott courts

పెద్దపల్లిరూరల్, న్యూస్‌లైన్ : హైకోర్టు ఆవరణలో తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం వారిపై ఇంకా వివక్ష కొనసాగుతోందనడానికి ఈ సంఘటనలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సందె మొగిళి, సత్యనారాయణ, అశోక్, జాపతి రాజేశం, రాంకిషన్‌రావు, డొంకెన మొగిళి, రమణారెడ్డి, బాదం రమేశ్, సురేశ్ తదితరులున్నారు.
 
 కరీంనగర్‌లో..
 కరీంనగర్ లీగల్ :  కరీంనగర్‌లోని జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి సంజీవరెడ్డి, బి.రఘునందన్‌రావు, బూడిద మల్లేశం, సయ్యద్ సాబీర్, శ్రీరాముల కిషన్, చౌడమల్ల వీరస్వామి, ముద్దమల్ల సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
 
 సుల్తానాబాద్‌లో..
 సుల్తానాబాద్: సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో మున్సిఫ్‌కోర్టు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులను ప్రభుత్వం కావాలనే అరెస్టులు చేయిస్తోందని లక్ష్మీరాజం, లక్ష్మీకాంతరెడ్డి, బాల కిషన్, ప్రసాద్, శ్రీనివాస్‌రావు, దివాకర్‌రావు, కాంపెల్లి నారాయణ, ఆకారపు సరోత్తమ్‌రెడ్డి, భూమయ్య, తిరుపతిరెడ్డి, శ్యామ్, రమేశ్, అంజయ్య ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement