
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు సహా కింది కోర్టులు, జ్యుడిషియల్ అకాడమీ, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలను కూడా అప్పటి వరకు మూసేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఇప్పటిలాగే అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరాలు గురువారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. రెడ్ జోన్‌లోని హైదరాబాద్‌లో ఉన్న మూడు ఫోరాలు, వరంగల్‌లోని ఒక్క ఫోరం పనిచేస్తున్నాయి. చదవండి: చైనాకు ప్రత్యామ్నాయం మనమే