ఖానాపూర్, న్యూస్‌లైన్ :
ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు తెలంగాణ సెగ తగిలింది. పల్లెనిద్రలో భాంగా ఖానాపూర్‌కు వచ్చిన ఆయనను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలంలో పల్లెనిద్రలో భాగంగా ఎంపీ రమేశ్ రాథోడ్ ఆదివారం పర్యటించారు. ముందుగా తర్లపాడ్‌లో ఎంపీ టీడీపీ జెండావిష్కరించారు. అనంతరం సత్తన్‌పల్లి గ్రామంలోని 222 ప్రధాన రహదారి పక్కనే జెండా ఎగురవేశారు. పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణవాదులు సత్తన్‌పల్లిలో జెండావిష్కరణ సమయంలో గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నగేశ్, రమేశ్, అనసూయ తదితరులు జెతైలంగాణ నినాదాలు చేశారు.
చంద్రబాబు తెలంగాణపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని, పల్లెనిద్ర పేరటి పర్యటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని లేదంటే ఇక్కడి నుంచి వెల్లిపోవాలంటూ ఎంపీ ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులను చెదరగొట్టారు. దీంతో ఎంపీ ప్రసంగాన్ని ఆపేసి దగ్గరలో ఉన్న బస్టాండ్‌లో కూర్చుకున్నాడు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో చేసేదిలేక ఎంపీ అక్కడి నుంచి బీర్నందికి వెళ్లారు. కాసేపటికి టీడీపీ జెండా తొలగించారని తెలియడంతో వాహనాలను సత్తన్‌పల్లికి తిరిగి మళ్లించారు. ఎంపీ అక్కడికి చేరుకుని జెండా పడివుండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీంతో టీడీపీ నాయకులు, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పొలీసులు ఇరువురిని సముదాయించారు. దీంతో ఎంపీ రెండోసారి జెండా ఎగురవేయగా జెండా తొలగించివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. పొలీసులు సముదాయించడంతో అక్కడి నుంచి టీడీపీ నాయకులు తిరిగి జెండా పండుగ కార్యక్రమానికి వెనుదిరిగారు. అక్కడి నుంచి పాత ఎల్లాపూర్ గోసంపల్లెలో రహదారిపై ఎంపీని ఇరుగ్రామాల ప్రజలు అడ్డుకున్నారు.
పంచాయతీ పరిధిలోని గోసంపల్లెలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్య పట్టించుకోవడం లేద ంటు సమస్యలపై ఇరుగ్రామాల ప్రజలను నిలదీశారు. 15 ఏళ్లుగా ఖానాపూర్ టు బెల్లాల్‌కు రోడ్డు కనీసం మరమ్మతు చేయించడం లేదని మీచుట్టు ఏళ్లుగా తిరిగినా పట్టించుకొనిది మీరు ఇప్పుడెందుకు వచ్చారంటూ ఎంపీని అడ్డుకొని ఎంపీ గోబ్యాక్ అంటూ నాయకులు చరణ్, శోభన్, మదు, లక్ష్మిపతి, నూనె రాజేశ్వర్, మాజీ ఎంపీపీ నాగుల శంకర్‌గౌడ్‌లు నినాదాలు చేశారు. గ్రామానికి రానివ్వమంటు రోడ్డుపై బైఠాయించారు. ఎంపీ సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు
ఎంపీకి తెలంగాణ సెగ
Published Mon, Nov 18 2013 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement