
పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తమ వ్యక్తిగత ముద్ర, ప్రాబల్యం కోసం విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఆడుకోవడం దురదృష్టకరం అన్నారు.
కెసిఆర్ 70 రోజుల పాలనలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజలను ఇబ్బందిపెట్టే విధంగానే కేసీఆర్ పాలన ఉందని పొన్నాల విమర్శించారు.