సాక్షి, నిజామాబాద్ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు, నిరసనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరును సమీ క్షించడానికి నిజామాబాద్‌కు వచ్చిన ఆర్టీఐ కమిషనర్ తాంతియాకుమారికీ తెలంగాణ సెగ తప్పలేదు. గత మూడు రోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో తెలంగాణ కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుల్లో భాగంగానే శుక్రవారం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశ పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమానికి పూనుకున్నారు. ఇదే సమయం లో కలెక్టరేట్ ప్రగతిభవన్‌లో ఆర్టీఐ కమిషనర్ తాంతియాకుమారి వివిధ ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై సమీ క్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నా యకులు నిరసన కార్యక్రమం లో ఉద్యోగులు పాల్గొనడానికి సమీక్ష సమావేశానికి ఒక గంటపాటు విరామం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆర్టీఐ కమిషనర్ కొన్ని శాఖల ఉద్యోగులు సమీక్ష నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించి, మరికొన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో సమావేశాన్ని కొనసాగించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు సమీక్షా సమావేశం ముగి సాక బయటకు వస్తున్న కమిషనర్ తాంతియకుమారితో వాగ్వాదానికి దిగారు. జై తెలంగా ణ.. జైజై తెలంగాణ.. నినాదాలు చేశారు. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మిమ్మల్ని ఇక్కడి పంపారా..? అంటూ తాంతియాను ప్రశ్నించారు. వెంటనే స్థానిక డీఎస్పీ అనీల్ కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు జేఏసీ నాయకులను అక్కడి నుంచి పంపివేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం జిల్లా ఎస్పీ కె.వి. మోహన్‌రావు తాంతియాకుమారిని కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తుంది. ఇది గమనించిన జేఏసీ నాయకులు ఆర్టీఐ కమిషన ర్ తమపై ఎస్పీకి ఫిర్యాదు చేశారన్న భావనతో మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
అంతటితో అగకుండా తెలంగాణ సాంప్రదాయాన్ని , సం స్కృతిని కించపరిచే విధంగా ఆర్టీఐ కమిషనర్ వ్యవహరించారన్న ఆరోపణతో వన్‌టౌన్ పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారికి చుక్కెదురయింది. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర వారంతా తెలంగాణ వారేననే భావన కలిగేలా తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకులు గైని గంగారాం, టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి, బార్ అసోసియోషన్ నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. అదే విధంగా నగరంలో అటవీ శాఖకు చెందిన ఉద్యోగులు పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తమ కార్యాలయం ఆవరణలో మానవహారం నిర్వహించారు.బోధన్‌లో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్భావన ర్యాలీలో ఉద్యోగు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ నందిపేట్ మండల కేంద్రంలో రిలే నిరహార దీక్షలు యదాతథంగా కొనసాగాయి.
తెలంగాణ సెగలు
Published Sat, Aug 17 2013 3:12 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement