ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణలో పది గంటల విద్యుత్ కోతలు విధించడానికి కుట్ర పన్నుతున్నాడని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ ఆరోపించారు. విద్యుత్ కోతలకు, సీఎం కుట్రలకు నిరసనగా 48 గంటలపాటు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు దీక్ష చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ధర్నాచౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌శర్మ మాట్లాడుతూ.. శాంతి యుతంగా దీక్ష చేపట్టిన రఘును పోలీసులు అక్రమంగా అరెస్‌ట చేయడం సమంజసం కాదన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ సీమాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకడం సరికాదన్నారు. ఒక్క క్షణం కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గైని గంగారాం, ప్రభాకర్, భాస్కర్, విద్యుత్ జేఏసీ కోకన్వీనర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
నాందేవ్‌వాడ : తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కిరణ్ ఆంధ్రప్రాంతం వారికి మద్దతు ఇస్తూ, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కుట్నలు పన్నుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. అక్రమగా అరెస్టు చేసిన రఘును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జేఏసీ నాయకులు తోట రాజశేఖర, ప్రసాద్, కాశీనాథ్, నాంపల్లి, చెన్నయ్య, సత్తయ్య, గంగారాం, కామేశ్వర్‌రావు, వెంకటరమణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.
సీఎం కుట్రవల్లే తెలంగాణకు విద్యుత్ కోత
Published Wed, Oct 9 2013 4:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement