ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో జిల్లాలో తెలంగాణవాదుల సంబరాలు రెండో రోజూ కొనసాగాయి. శుక్రవారం అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు మిన్నంటిన ఉత్సాహంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. జేఏసీ, యు వజన సంఘాలు, వివిధ పార్టీలు, సింగరేణి కార్మికులు, న్యాయవాదులు తెలంగాణ సంబరాలను జరుపుకున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన, ర్యాలీలు, బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. అమరుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారిని స్మరించుకున్నారు.
సంబరమే సంబరం..
ఆదిలాబాద్‌లో తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. రాత్రి టీజీఏ, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వారిని స్మరించుకున్నారు. నాయకులు బండారి సతీష్, బాల శంకర్‌కృష్ణ పాల్గొన్నారు. బోథ్‌లో టీఆర్‌ఎస్ నాయకులు గాడ్గే సుభాష్, శంకర్ పాల్గొన్నారు. తహశీల్దార్, ఎంపీడీవో సిబ్బందికి మిఠాయిలు పంచారు.
నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఇంటి ఎదుట నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు. కడెంలో కాంగ్రెస్ నాయకులు హరినాయక్, జన్నారంలో టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సత్యం, ఇంద్రవెల్లిలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్క కమ్ము, ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకున్నారు. పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్‌లు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. పట్టణ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.
మందమర్రిలో కాంగ్రెస్ మండల నాయకులు ఎల్లాగౌడ్, రామకృష్ణాపూర్‌లో పెద్దపల్లి పార్లమెంట్ యూత్ అధ్యక్షుడు శ్యామ్‌గౌడ్, చెన్నూర్‌లో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టి.రవికుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలో న్యాయవాదులు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జఫార్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు రమణారావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. రెబ్బెనలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
‘టీ టెన్’ జోష్
Published Sat, Dec 7 2013 4:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement