ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నాలుగు టెలికాం సంస్థల ప్రొవైడర్లు కృష్ణా జిల్లా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.
విజయవాడ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నాలుగు టెలికాం సంస్థల ప్రొవైడర్లు కృష్ణా జిల్లా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉపయోగించిన 25 నంబర్ల కాల్ డేటాలను కోర్టుకు అందజేశారు. కాల్ డేటాల వివరాలను సీల్డ్ కవర్లలో ఎయిర్టెల్, ఐడియా, డొకోమో, వొడాఫోన్ ప్రతినిధులు కోర్టుకు హాజరై వివరాలను సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో ఉండటంతో సెప్టెంబర్ 11కు కేసు వాయిదా వేశారు.