జెయింట్ వీల్ ప్రమాదం:10 మందికి గాయాలు | ten people injured in krishna district jaint wheel incident | Sakshi
Sakshi News home page

జెయింట్ వీల్ ప్రమాదం:10 మందికి గాయాలు

Apr 25 2016 10:07 AM | Updated on Sep 3 2017 10:43 PM

కృష్ణా జిల్లా రంగమ్మ పేరంటాళ్ల తిరునాళ్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో తిరునాళ్లు సందర్భంగా జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు.

ఉంగుటూరు: కృష్ణా జిల్లా రంగమ్మ పేరంటాళ్ల తిరునాళ్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో తిరునాళ్లు సందర్భంగా జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అది తిరుగుతుండగా ఒక చెయిర్ వద్ద బోల్టు అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో దానిపై కూర్చున్న పది మంది యువకులు కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స్ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement