పెన్షన్.. టెన్షన్! | Tension of the pension ..! | Sakshi
Sakshi News home page

పెన్షన్.. టెన్షన్!

Published Fri, Feb 5 2016 10:30 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

పెన్షన్.. టెన్షన్! - Sakshi

పెన్షన్.. టెన్షన్!

 అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో కియాశీలకంగా వ్యవహరించాల్సిన జన్మభూమి కమిటీల తీరుపై హైకోర్టు మండిపడింది. బాధితులు నేరుగా న్యాయస్థానానికి  హాజరై తమకు జరుగుతున్న అన్యాయాలపై ఏకరువు పెట్టడంతో కోర్టు స్పందించింది. జిల్లాలో ప్రభుత్వ పింఛన్లు పొందడానికి అర్హులను సమగ్రంగా పరిశీలించాలంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అర్హత పొందిన వారిని అనర్హులంటూ జన్మభూమి కమిటీలు ఎలా నిరాకరిస్తాయని ప్రశ్నించింది. దీంతో జేబీ కమిటీల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది.
 
 శ్రీకాకుళం టౌన్/పొందూరు:
 వారు చాలా ఏళ్లుగా వృద్ధాప్య, వితంతు పింఛన్లను అందుకుంటున్నారు. అయితే జన్మభూమి కమిటీల పుణ్యమాని బతికుండగానే చనిపోయినట్టు చూపించి పింఛన్లను తొలగించేశారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితులు కోర్టులను ఆశ్రయించారు. నేను బతికుండగానే చనిపోయినట్టు కారణం చూపుతూ పింఛన్‌ను తీసేశారు. అక్టోబర్- 2014 నుంచి పింఛన్‌ను నిలుపుదల చేశారు. పలుమార్లు జిల్లా, మండల గ్రీవెన్స్‌సెల్‌ల్లో వినతులు ఇచ్చాను. నేను బతికే ఉన్నానని ఆధారాలు చూపాను. అయినా జన్మభూమి కమిటీలు, ఎంపీడీఓ, కార్యదర్శి పట్టించుకోలేదు.   కొంచాడ అమ్మన్నమ్మ, వృద్ధురాలు,జన్మభూమి కమిటీల తీరుతో పింఛన్లు కోల్పోయిన పొందూరు మండలానికి చెందిన వృద్ధురాలు కొంచాడ అమ్మనమ్మ, వితంతువు మెట్ట లక్ష్మిలు నేరుగా హైకోర్టును ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు జన్మభూమి కమిటీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఆ వృద్ధ మహిళను చూస్తే పింఛన్‌కు అర్హురాలని ఇట్టే చెప్పేస్తారు. మీ అధికారులకు కనిపించడం లేదా? భౌతికంగా చూసి వృద్ధులు కాదంటారా, ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదంటారా, ఫెన్షన్ రాదని తేల్చిచెప్పేస్తారా అని ప్రశ్నించింది. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తే ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి వచ్చి వారు అలానే చేస్తే అంతిమంగా ఇబ్బంది పడేది ప్రజలే..అంటూ జన్మభూమి కమిటీల తీరును తప్పుపట్టింది. దీంతో జన్మభూమి కమిటీలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. అప్పుడే న్యాయబద్ధంగా వ్యవహరించి ఉంటే..ఇప్పుడు ఈ టెన్షన్‌కు ఆస్కారం ఉండేదికాదంటున్నాయిఇంతకీ జన్మభూమి కమిటీలు ఏం చేశాయంటే...

ఇటీవల జరిగిన జన్మభూమి సభల సందర్భంగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున జిల్లా వ్యాప్తంగా 10 వేల పింఛన్లు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 1,13,849 వృద్ధాప్య పింఛన్లకు  రూ.11.91 కోట్లు, 94,673 వితంతు పెన్షన్లకు రూ.10.11 కోట్లు, చేనేత కార్మికులకు 4063 మందికి రూ. 43 లక్షలు, వికలాంగులు 31,195 మందికి రూ.3.76 కోట్లు, టాపర్లకు 615 మందికి రూ.6.3 లక్షలు, అభయహస్తం 29,324 మందికి రూ. 3.05 కోట్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం పెన్షన్లకు 2,73,719 మందికి గాను రూ.29.34 కోట్లు ప్రతినెలా అందజేస్తున్నారు. తాజాగా పదివేలు కొత్తపెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ..అర్హులను ఎంపిక చేసే బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. గ్రామస్థాయి కమిటీ, మండలస్థాయికి అర్హుల జాబితాలను పంపిస్తే అక్కడ మంజూరు అర్హతలను బట్టి మంజూర్లు ఇస్తున్నారు. అయితే గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ ఎంపిక ప్రక్రియలో అర్హతలను పక్కనపెట్టి అధికార పక్షమే ప్రాధాన్యతగా పెట్టుకుని జాబితాలను తయారు చేశారు.
 

ఇందులో ఆన్‌లైన్లో అర్హతలను అధికారులు గుర్తించినా వారి మాట చెల్లుబాటుకాకుండా పెన్షన్లను తొలగించేశారు. వయసు మీదపడ్డ వారిని వృద్ధులు కాదని, బతికున్న వారిని చనిపోయారంటూ, వికలాంగులకు అర్హత సర్టుఫికెటు ఉన్నా తొలగించేశారు. దీంతో అర్హులకు అన్యాయం జరిగిందంటూ జిల్లాలోని సంతకమిటి మండలం అప్పాపురం, ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పొందూరు మండలం అదపాక నుంచి బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.మరికొందరు..నియోజక వర్గాలవారీగా  పింఛన్ల తిరస్కరణకు గురైన వారిలో మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. పంచాయతీ, మండలస్థాయిలో ఎంపీడీవో, జిల్లాస్థాయిలో డీఆర్‌డీఏ పీడీ, జిల్లా కలెక్టర్, సెర్ప్ సీఈవో, గ్రామస్థాయి, జన్మభూమి కమిటీ, మండలస్థాయి కమిటీలను బాధ్యులను చేస్తూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు.

  పాతపట్నం నియోజకవర్గంలో దబ్బపాడు గ్రామానికి చెందిన పిర్ల పాపమ్మ (77) వృద్ధురాలు. భర్త చనిపోవడంతో వితంతువు కూడా. ఆమె పెన్షన్‌ను జన్మభూమి కమిటీ తొలగించింది. కలెక్టరుకు ఫిర్యాదు చేసినా కనికరం లేక పోయింది. ఈమె కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement