
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరుగున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. సోమవారం ఉదయం జరగాల్సిన గణిత ప్రశ్నాపత్రం... వైఎస్సార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పరీక్షకు అరగంట ముందే లీకైందంటూ తెలుస్తోంది. సోషల్ మీడియా మ్యాథ్స్ పేపర్ వైరల్ అవుతుంది. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన వార్తలతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే అధికారులు మాత్రం పేపర్ లీకు అయినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల తెలియల్సి ఉంది.