బాలిక దారుణ హత్య | The assassination of girl | Sakshi
Sakshi News home page

బాలిక దారుణ హత్య

Published Sun, Jun 15 2014 12:38 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

బాలిక దారుణ హత్య - Sakshi

బాలిక దారుణ హత్య

శావల్యాపురం
 మూడు రోజుల క్రితం అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక శవమై శనివారం ఉదయం మండలంలోని కనవర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండి వాగు వద్ద కనిపించింది. అత్యంత పాశవికంగా లైంగికదాడి జరిపి ఆపై దారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఈ ప్రాంతంలో కల కలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజకకాలనీకి చెందిన పాలడుగు లింగయ్య, లింగమ్మ దంపతులకు సంతానం లేదు. నెలల వయస్సులో లక్ష్మీతిరుపతమ్మను సమీప బంధువుల నుంచి దత్తత తీసున్నారు. లక్ష్మీతిరుపతమ్మ సమీప నిర్మల బాలికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈనెల 11వ తేదీ సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక వద్దకు  వరుసకు బాబా యి అయ్యే వెంకటేశ్వర్లు వెళ్లి .. అమ్మ ఉందా అని అడిగాడు.
 
 
 వాగుకు వెళ్లిందని సమాధానం ఇవ్వడంతో బాలి కకు మాయమాటలు చెప్పి మోటారు బైక్‌పై తీసుకువెళ్లాడు. వాగుకు వెళ్లిన లింగమ్మ ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. దీంతో బంధువుల సహాయంతో కుమార్తె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం వినుకొండ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  శనివారం ఉదయం పనులకు వెళ్లిన ఉపాధి హామీ కూలీలకు కనవర్లపూడిలోని నక్కలగండి వాగు వద్ద దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వారు వెంటనే కనవర్లపూడి వీఆర్వోకు తెలియజేశారు.
 
 వెంటనే వీఆర్వో వినుకొండ, శావల్యాపురం పోలీ సులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం లక్ష్మీతిరుపతమ్మదిగా గుర్తిం చారు. నరసరావుపేట డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, వినుకొండ పట్టణ, రూరల్ సీఐలు శ్రీకాంత్, చిన్నమల్లయ్య, ఎస్‌ఐ రవికృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 రేప్ చేసి.. హత్య చేశారు: డీఎస్పీ
 బాలిక లక్ష్మీతిరుపతమ్మను రేప్‌చేసి హత్య చేసి వుండవచ్చని నరసరావుపేట డీఎస్పీ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు.మృతదేహం కుళ్లిపోయిందని, పోస్టుమార్టం రిపో ర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాలికపై లైంగికదాడి, హత్యకేసులో ఇప్పటికే ఒక నింది తుడ్నిఅదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
 
 బాబాయే హంతకుడా?
 ముక్కుపచ్చలారని 11 సంవత్సరాల బాలిక లక్ష్మీతిరుపతమ్మపై వరుసకు బాబాయి అయిన వెంకటేశ్వర్లు లైంగికదాడి జరిపి హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను ఎక్కించుకున్న మోటారుబైక్‌పై మరో యువకుడు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంట రిగా వచ్చి బాలికను బైక్‌పై ఎక్కించుకున్న వెంకటేశ్వర్లు రోడ్డు ఎక్కిన తరువాత మరో యువకుడిని బైక్‌పై తీసుకువెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కావ్యూహం ప్రకారమే వెంకటేశ్వర్లు బాలికను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం లింగమ్మ భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తె లక్ష్మీతిరుపతమ్మతోపాటు రజకకాలనీలో ఉంటోంది. ఈ నేపథ్యంలో లింగమ్మకు వెంకటేశ్వర్లుతో సంబంధం ఏమైనా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానంపై పోలీసులు లింగమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మోటారుబైక్‌పై ఎక్కిన మరో యువకుడు ఎవరనేది ఇంకా నిర్థారణకు రాలేదు.
 
 వినుకొండ ప్రాంతంలో సంచలనం..
 వినుకొండ టౌన్: అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురికావడం వినుకొండ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పట్టణానికి దూరంగా ఉన్న రజకకాలనీలోని ప్రజలు పలు పనులపై పట్టణానికి వెళుతుంటారు. ప్రతి రోజూ ఉదయం వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇంటి వద్ద పిల్లలు, వృద్ధులు ఉంటారు. బాలిక కిడ్నాప్, హత్య సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
 
 కిడ్నాప్‌నకు ముందు జరిగిన సంఘటనపై బాలిక అమ్మమ్మ రత్తమ్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి...‘ బుధవారం సాయంత్రం 4.30 సమయంలో లక్ష్మీతిరుపతమ్మ ఆడుకుంటుండగా ఓ వ్యక్తి తమ బంధువునంటూ చ్చి మీ అమ్మ ఎక్కడ ఉందని అడిగాడు. బంధువుల చావు కబురు చెప్పాలని.. ఎక్కడ ఉందో చూపిస్తే సమాచారం చెప్పి వెళతానని అన్నాడు. బండిమీద నా మనవరాలిని ఎక్కించుకు వెళ్లాడు. నాకు కళ్లు సరిగా కన్పించకపోవడంతో ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తు పట్టలేదు. బంధువే అయివుంటాడని అనుకున్నాను’ అంటూ రత్తమ్మ భోరున విలపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement