venkateshwarallu
-
సమీకృత సేద్యం.. సంతోషం!
ప్రకృతి వ్యవసాయ పితామహుడు డా. సుభాష్ పాలేకర్ శిక్షణ అందించిన స్ఫూర్తితో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి.. ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బండారు వెంకటేశ్వర్లు, పుష్పలత దంపతుల కృషి చక్కని ఫలితాలనిస్తోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంలోని తమ 12 ఎకరాల సొంత భూమిలో సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐసీఏఆర్ అందించే జాతీయ స్థాయి హల్దార్ సేంద్రియ రైతు పురస్కారానికి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. నల్గొండలో, తూ.గో. జిల్లా సర్పవరంలో పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరై 2014లో రెండు నాటు ఆవులను కొనుక్కొని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు కుమారుడు, కుమార్తె ప్రైవేటు ఉద్యోగులు. దంపతులు ఇద్దరే సాధ్యమైనంత వరకు వ్యవసాయ పనులు చేసుకుంటారు. అవసరమైతేనే కూలీలను పిలుస్తారు. వరి, వేరుశనగ వంటి పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు.. మొత్తం 14 రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఫామ్ పాండ్‌లో చేపల సాగుతో సమీకృత ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. గడ్డిపల్లి కేవీకె శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆదర్శ సేద్యం చేస్తున్నారు. భూసారాన్ని పెంచేందుకు పశువుల ఎరువు, ఘనజీవామృతం, వేప పిండి, కొబ్బరి చెక్క, కానుగ చెక్క, జీవామృతం, వేస్ట్ డీకంపోజర్తోపాటు జీవన ఎరువులను సైతం వాడుతున్నారు. పంటల మార్పిడితోపాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంగువ ద్రావణం, వేప గింజల కషాయం, వంటి వాటితోనే సేద్యం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వైరస్ లేని బొప్పాయి సాగు వెంకటేశ్వర్లు గత మూడేళ్లుగా బొప్పాయి సాగు విస్తీర్నం పెంచుకొని కరోనా నేపథ్యంలో మంచి ఆదాయం గడించడం విశేషం. బొప్పాయిలో కలుపుతీతకు పవర్ వీడర్‌ను స్వయంగా ఉపయోగిస్తున్నారు. 8.5 ఎకరాల్లో బొప్పాయి కాసులు కురిపిస్తుంటే ఎకరంలో నిమ్మ తోటపై రూపాయి కూడా రావటం లేదన్నారు. ఎకరాకు 33 బస్తాల ధాన్యం దిగుబడి వరి సాగులో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నారు. వానాకాలంలో సాంబ మసూరి వరిలో ఎకరాకు 33 బస్తాల దిగుబడి సాధిస్తూ క్వింటా బియ్యం రూ. 5,500 చొప్పున తన ఇంటి దగ్గరే అమ్ముతున్నారు. ఆ పొలంలో శీతాకాలంలో పుచ్చ సాగు చేస్తున్నారు. అరటి, నేరేడు, మామిడి, ఉసిరి, సపోట, ఇంకా పలు రకాల పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. అన్ని ఖర్చులూ పోను 12 ఎకరాల్లో ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం మిగులుతున్నదని వెంకటేశ్వర్లు సంతోషంగా చెప్పారు. 50 శాతం ప్రభుత్వ రాయితీపై ఫాం పాండ్‌ను నిర్మించి డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో నీటిని నిల్వ చేసుకొని, ఉద్యానవన పంటలను సాగు చేసుకుంటూ దానిలో చేపలను పెంచుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా నిలువు పందిళ్లు మేలు! తీగజాతి కూరగాయల సాగుకు రాతి స్తంభాలతో శాశ్వత ప్రాతిపదికన పందిళ్లు వేసే కన్నా.. వెదురు బొంగులు, ప్లాస్టిక్ తాళ్లు, పురికొసలతో కూడిన తాత్కాలిక నిలువు పందిళ్లు వేసుకోవటం రైతులకు ఎంతో మేలని హల్దార్ సేంద్రియ రైతు జాతీయ పురస్కారం అందుకున్న బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. నిలువు పందిళ్లకు ఎకరానికి రూ. 50 వేల లోపు ఖర్చవుతుంది. శాశ్వత పందిళ్లు వేసుకోవడానికి ఇంకా అధిక పెట్టుబడి అవసరం. నిలువు పందిళ్లను పంట అయిపోగానే తీసేసి పక్కన పెట్టుకొని, మళ్లీ సులువుగా వేసుకోవచ్చు. ఆ స్థలంలో పంట మార్పిడికి కూడా ఇవి అనుకూలం. శాశ్వత పందిరి వేసుకుంటే.. ఆ స్థలంలో ప్రతిసారీ కూరగాయ పంటలే వేసుకోవాలి, పంట మార్పిడికి అవకాశాలు తక్కువ. పిచాకారీలకు, కూరగాయల కోతకు నిలువు పందిళ్లే మేలు. నిలువు పందిళ్లలో పంటలకు గాలి, వెలుతురు బాగా తగులుతుంది. దిగుబడీ బాగుంటుంది. వీటిలో పాముల బెడద కూడా తక్కువ. సేంద్రియ మార్కెట్లు నెలకొల్పాలి అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావు ప్రోత్సాహంతో పాలేకర్ శిక్షణ పొందాను. పుస్తకాలు చదివి అవగాహన పెంచుకున్నాను. సీనియర్ రైతుల స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంలోకి మారాను. తొలి రెండేళ్లు కష్టనష్టాలు చవిచూసి, మానేద్దామనుకున్నా. మా పొలానికి వచ్చి చూసిన అప్పటి కలెక్టర్ సురేంద్రమోహన్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కొనసాగించాను. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు, అధికారుల తోడ్పాటుతో ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నా భార్య, నేను పగలంతా పొలం పనులు చేసుకుంటాం. మరీ అవసరమైతేనే కూలీలను పిలుస్తాం. రెండేళ్లుగా పండించినవన్నీ తోట దగ్గరే ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నా. నికరాదాయం బాగానే ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక సేంద్రియ మార్కెట్లు నెలకొల్పి, ప్రచారం కల్పించి ప్రజల్లో చైతన్యం తేవాలి. రసాయన ఎరువులకు ఇస్తున్న రాయితీ మాదిరిగానే వేప పిండి తదితర వాటికి కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తేనే ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తుంది. – బండారు వెంకటేశ్వర్లు (77027 10588), ఐసీఏఆర్ హల్దార్ సేంద్రియ రైతు జాతీయ అవార్డు గ్రహీత, నరసింహుల గూడెం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తున్నాం బండారు వెంకటేశ్వర్లు దంపతులు రోజంతా పొలం పని చేస్తారు. కరోనా కాలంలో బొప్పాయికి వచ్చిన గిరాకీ వల్ల వారి కష్టానికి తగిన ఆదాయం వచ్చింది. మా కేవీకేలో రైతులకు సేంద్రియ సేద్యంలో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నాం. జీవన ఎరువులు, వర్మీకంపోస్టు, అజొల్లా వంటి ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు ఇస్తున్నాం. సేంద్రియ రైతులకు మార్కెటింగే సమస్య. ప్రభుత్వమే తీర్చాలి. సబ్సిడీపై ఆవులు, జీవన ఎరువులు ఇవ్వాలి. – డా. లవకుమార్ (98490 63796), సమన్వకర్త, శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేవీకే, గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా బండారు వెంకటేశ్వర్లు 2014 నుంచి తన సొంత భూమి 12 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తూ సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకపోవటం వల్ల మొదటి ఏడాది నుంచీ ఖర్చులు బాగా తగ్గాయి. అయితే, దిగుబడులు మొదటి ఏడాది బాగా తగ్గాయి. క్రమంగా పెరిగి మూడేళ్లకు దిగుబడి మంచి స్థాయికి పెరిగింది. గత ఐదేళ్లలో ఖర్చులు పోను నికరాదాయం గణనీయంగా పెరిగింది. 2016–17లో రూ. 7,57,238 నికరాదాయం పొందగా 2020–21 నాటికి ఇది రూ. 13,98,738కు పెరగటం విశేషం. -
బాలిక దారుణ హత్య
శావల్యాపురం మూడు రోజుల క్రితం అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక శవమై శనివారం ఉదయం మండలంలోని కనవర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండి వాగు వద్ద కనిపించింది. అత్యంత పాశవికంగా లైంగికదాడి జరిపి ఆపై దారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఈ ప్రాంతంలో కల కలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజకకాలనీకి చెందిన పాలడుగు లింగయ్య, లింగమ్మ దంపతులకు సంతానం లేదు. నెలల వయస్సులో లక్ష్మీతిరుపతమ్మను సమీప బంధువుల నుంచి దత్తత తీసున్నారు. లక్ష్మీతిరుపతమ్మ సమీప నిర్మల బాలికోన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈనెల 11వ తేదీ సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక వద్దకు వరుసకు బాబా యి అయ్యే వెంకటేశ్వర్లు వెళ్లి .. అమ్మ ఉందా అని అడిగాడు. వాగుకు వెళ్లిందని సమాధానం ఇవ్వడంతో బాలి కకు మాయమాటలు చెప్పి మోటారు బైక్‌పై తీసుకువెళ్లాడు. వాగుకు వెళ్లిన లింగమ్మ ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. దీంతో బంధువుల సహాయంతో కుమార్తె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం వినుకొండ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం పనులకు వెళ్లిన ఉపాధి హామీ కూలీలకు కనవర్లపూడిలోని నక్కలగండి వాగు వద్ద దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వారు వెంటనే కనవర్లపూడి వీఆర్వోకు తెలియజేశారు. వెంటనే వీఆర్వో వినుకొండ, శావల్యాపురం పోలీ సులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం లక్ష్మీతిరుపతమ్మదిగా గుర్తిం చారు. నరసరావుపేట డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, వినుకొండ పట్టణ, రూరల్ సీఐలు శ్రీకాంత్, చిన్నమల్లయ్య, ఎస్ఐ రవికృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేప్ చేసి.. హత్య చేశారు: డీఎస్పీ బాలిక లక్ష్మీతిరుపతమ్మను రేప్‌చేసి హత్య చేసి వుండవచ్చని నరసరావుపేట డీఎస్పీ ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు.మృతదేహం కుళ్లిపోయిందని, పోస్టుమార్టం రిపో ర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాలికపై లైంగికదాడి, హత్యకేసులో ఇప్పటికే ఒక నింది తుడ్నిఅదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బాబాయే హంతకుడా? ముక్కుపచ్చలారని 11 సంవత్సరాల బాలిక లక్ష్మీతిరుపతమ్మపై వరుసకు బాబాయి అయిన వెంకటేశ్వర్లు లైంగికదాడి జరిపి హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను ఎక్కించుకున్న మోటారుబైక్పై మరో యువకుడు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంట రిగా వచ్చి బాలికను బైక్‌పై ఎక్కించుకున్న వెంకటేశ్వర్లు రోడ్డు ఎక్కిన తరువాత మరో యువకుడిని బైక్‌పై తీసుకువెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కావ్యూహం ప్రకారమే వెంకటేశ్వర్లు బాలికను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం లింగమ్మ భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తె లక్ష్మీతిరుపతమ్మతోపాటు రజకకాలనీలో ఉంటోంది. ఈ నేపథ్యంలో లింగమ్మకు వెంకటేశ్వర్లుతో సంబంధం ఏమైనా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానంపై పోలీసులు లింగమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మోటారుబైక్పై ఎక్కిన మరో యువకుడు ఎవరనేది ఇంకా నిర్థారణకు రాలేదు. వినుకొండ ప్రాంతంలో సంచలనం.. వినుకొండ టౌన్: అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురికావడం వినుకొండ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పట్టణానికి దూరంగా ఉన్న రజకకాలనీలోని ప్రజలు పలు పనులపై పట్టణానికి వెళుతుంటారు. ప్రతి రోజూ ఉదయం వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇంటి వద్ద పిల్లలు, వృద్ధులు ఉంటారు. బాలిక కిడ్నాప్, హత్య సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్‌నకు ముందు జరిగిన సంఘటనపై బాలిక అమ్మమ్మ రత్తమ్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి...‘ బుధవారం సాయంత్రం 4.30 సమయంలో లక్ష్మీతిరుపతమ్మ ఆడుకుంటుండగా ఓ వ్యక్తి తమ బంధువునంటూ చ్చి మీ అమ్మ ఎక్కడ ఉందని అడిగాడు. బంధువుల చావు కబురు చెప్పాలని.. ఎక్కడ ఉందో చూపిస్తే సమాచారం చెప్పి వెళతానని అన్నాడు. బండిమీద నా మనవరాలిని ఎక్కించుకు వెళ్లాడు. నాకు కళ్లు సరిగా కన్పించకపోవడంతో ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తు పట్టలేదు. బంధువే అయివుంటాడని అనుకున్నాను’ అంటూ రత్తమ్మ భోరున విలపించింది. -
రూ.1.34 లక్షల పట్టివేత
మక్తల్, న్యూస్‌లైన్ : ఓ కారులో టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు రూ.1.23 లక్షలను తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... శుక్రవారం ఉదయం మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి బంధువులు వెళుతున్న కారును ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి,హెడ్‌కానిస్టేబుల్ జమీరొద్దీన్, కాని స్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి ఆపారు. అందు లో చిన్నచింతకుంట మండలం పర్కాపురానికి తరలిస్తున్న రూ.1.23 లక్షలతో పాటు పార్టీకి చెందిన 30 టీషర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో తహశీల్దార్ సాయిరాంకు అప్పగించా రు. కాగా పట్టుబడిన కారు మహబూబ్‌నగర్‌లోని ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులు కౌసిక్‌రెడ్డి, శ్రీనివాసులును నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. మంతటిగడ్డ సమీపంలో... నాగర్‌కర్నూల్ : కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు డబ్బులు పం చుతున్న ఇద్దరు వ్యక్తులు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోగా, మరో నలుగురు పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ నుంచి అచ్చంపేట వెళ్లే దారిలో మంతటిగడ్డ సమీపంలో టీఆర్ఎస్ బహిరంగసభకు వచ్చిన వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారని స్థానికులు కొందరు ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్‌కు సమాచారమిచారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి కారువంగకు చెందిన వెంకటరమణగౌడ్, రాములును పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10,690 స్వాధీనం చేసుకోగా మరో నలుగురు వ్యక్తులు పారిపోయారు. -
కక్షల కుంపటి.. బతుకు చీకటి
కక్షల కుంపటి ఆరు జీవితాలను కటకటాల్లోకి నెట్టింది. టి.గోకులపాడులో సర్పంచ్ పదవి దక్కకపోవడం ఓటమి వర్గాన్ని హత్యకు ఉసిగొల్పింది. సంతకు వెళ్తుండగా దారికాచి అత్యంత దారుణంగా హతమార్చారు. ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనపై క్రిష్టగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తుది తీర్పు వెలువడుతున్న విషయం తెలిసి నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులతో జిల్లా కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీరిలో ఎడతెగని ఉత్కంఠ. ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ జడ్జి తీర్పునివ్వడంతో వారి కళ్లలో కన్నీరు కట్టలు తెంచుకుంది. కర్నూలు(లీగల్), న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికలు రేపిన చిచ్చు రెండు కుటుంబాలకు దహించి వేసింది. రాజుకున్న వివాదం మరింత రగిలడంతో కాంగ్రెస్ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రత్యర్థులు పొట్టనపెట్టుకోగా ప్రస్తుతం నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. ఫలితంగా రెండు కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గోకులపాడుకు సంబంధించిన ఈఘటనపై నమోదైన కేసులో ఆరవ అదనపు జిల్లా జడ్జి పి.వి. జోతిర్మయి ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. వివరాలు.. క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడుకు చెందినతెలుగు రంగన్న కుమారుడు వెంకటేశ్వర్లు 2006 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించా డు. టీడీపీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన పింజరి మౌలాలి రంగన్న, అతని కుమారుడిపై కక్ష పెంచుకున్నాడు. వారి హత్యకు పథకం పన్ని 2008 మే నెల 11వ తేదీన అమలు చేశాడు. కుమారుడి తో కలిసి ఆటోలో వెల్దుర్తికి వెళ్తున్న తెలు గు రంగన్నను అదే గ్రామానికి చెందిన బోయబోగం పెద్ద మద్దిలేటి, బోయబో గం చిన్నమద్దిలేటి, పెద్దయ్య, రామాం జినేయులు, హనుమన్న, చిన్నహనుమంతు, చంద్ర, పెద్ద హనుమంతు, నాగన్న, లక్ష్మన్న, కొండాపురం మద్దిలేటి, రామాంజనేయులుతో కలిసి హత్య చేసినట్లు తెలుగు మల్లేసు ఫిర్యాదు చేయడంతో క్రిష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో 1వ నిందితుడు బోయబోగం పెద్దమద్దిలేటి, 5వ నిం దితుడు బోయ హనుమన్న, 6వ నిం దితుడు బోయ చిన్నహనుమంతు, 9వ నిందితుడు బోయబోగం నాగన్న, 10వ నిందితుడు బోయబోగం లక్ష్మన్న, 11వ నిందితుడు బోయ కొండాపురం మద్దిలేటిపై నేరం రుజువు కావడంతో వారికి జీవితఖైదు, రూ. వెయ్యి ప్రకారం జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిం ది. 2, 3, 4, 7, 8, 12వ నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టేసింది. సాయంత్రం 4 గంటలకు తీర్పు రావడంతో నిందితుల కుటుంబీకులు, బంధువుల రోదనతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. శిక్ష పడిన వారిని సాయంత్రం 5 గంటలకు పోలీసు వ్యాన్‌లో కర్నూలు సబ్ జైలుకు తరలించారు. గోకులపాడులో నిశ్శబ్దం క్రిష్ణగిరి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామం సుమారు యాభై ఏళ్లుగా ఆధిపత్య గొడవల్లో రగిలిపోతోంది. ఇరువర్గాల నాయకులు ఆధిపత్యపోరులో అమాయకులు బలై పోతున్నారు. 2008లో జరిగిన హత్య కేసులో నేరం రుజువు కావడంతో ఓ వర్గానికి చెందిన వారికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. కేసులో ఒక వర్గం ఎప్పుడో ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా ప్రస్తుతం మరో వర్గం జైలుపాలు కావడంతో వారి మీద ఆధారపడిన కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమైంది. యాభై ఏళ్లుగా సాగుతున్న కోట్ల, కేఈ వర్గాల ఆధిపత్య గొడవల్లో ఇప్పటికి ఇరువర్గాలకు చెందిన పది మంది బలైపోయారు. వీరి కుటుంబాలు దాదాపు రోడ్డున పడ్డాయి. 30ఏళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన వారికి మొదటిసారి ఐదేళ్ల జైలుశిక్ష పడడంతో అనుభవించారు. ప్రస్తుతం రెండోసారి గ్రామానికి చెందిన వారికి కోర్టు శిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐలు శ్రీహరి, తిరుపతిబాబు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు పనులకు ఉత్తమ్ శంకుస్థాపన
మేళ్లచెర్వు, న్యూస్‌లైన్: కందిబండ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కందిబండ గ్రామ పరిధిలోని కోదాడ-మేళ్లచెర్వు రోడ్డు మెయిన్‌రోడ్డు నుంచి నల్లబండగూడెం వరకు రూ.కోటి 20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులను, గ్రామంలో నిర్మిస్తున్న అంతర్గత రోడ్డు పనులకు ఆయన బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో లో ఓల్టేజీ సమస్య పరిష్కరించేందుకు విద్యుత్ సబ్ స్టేషన్‌కు రూ.కోటి 20 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆ సబ్‌స్టేషన్ పనులు పూర్తి కావచ్చాయన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్డు పనులకు రూ.5 లక్షలు, తాగునీటికి రూ.10 లక్షలు, ఎస్సీ కమ్యూనీటి హాల్‌కు రూ.10 లక్షలు తన నిధుల నుంచి మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలకు ప్రహరీకి, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు, హౌసింగ్ శాఖ ప్రత్యేక అధికారి గోపిరెడ్డి వీరారెడ్డి, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగాని నాగన్న, సర్పంచ్ రుక్కయ్య, బొబ్బా భాగ్యరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పత్తిపాటి అశ్వని లెనిన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ పి.సీతారామిరెడ్డి, బానోతు బాబు, కొండా వెంకటేశ్వర్లు, పి వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వీరబాబుల్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కందిబండలోని చెన్నకేశవస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ సీతారామిరెడ్డి, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
పొదలకూరు/రాపూరు, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు మరో అవినీతి ఉద్యోగి భరతం పట్టారు. ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న రాపూరు సర్వేయర్ లాలి వెంకటేశ్వర్లును శనివారం పొదలకూరులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ నెల్లూరు డీఎస్పీ జె.భాస్కర్‌రావు కథనం మేరకు..రాపూరు మండలం గండూరుపల్లికి చెందిన రైతు గుడిగుంట బాలకృష్ణయ్య రెండు దశాబ్ధాలుగా ఏడెకరాల పొలాన్ని సాగుచేసుకుంటున్నాడు. ఆ పొలానికి సంబంధించి తన కుటుంబంలోని నలుగురి పేర్లపై ఏడో విడత భూపంపిణీలో పట్టాలు పొందే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అందులో భాగంగా డిసెంబర్లో రాపూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులకు అర్జీ సమర్పించాడు. పట్టాలు పొందేందుకు భూమిని సబ్‌డివిజన్ చేయాల్సి ఉండటంతో సర్వేయర్ వెంకటేశ్వర్లును కలిశాడు. ఆయన ఎకరాకు రూ.2,500 లంచం ఇవ్వాలని బాలకృష్ణయ్యను డిమాండ్ చేశాడు. చివరకు రూ.2,200 వంతున ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లించాలని సూచించాడు. పొలాన్ని సబ్‌డివిజన్ చేయించుకునేందుకు లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు బాలకృష్ణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సర్వేయర్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, పొదలకూరులోని తన ఇంటి వద్దకు రావాలని చెప్పాడు. పొదలకూరులోని నాగార్జున స్కూలు సమీపంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద బాలకృష్ణయ్య వద్ద రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వెంకటేశ్వర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాపూరులో ఆయన విధులు నిర్వర్తించే కార్యాలయానికి తీసుకెళ్లారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న అనంతరం నెల్లూరుకు తరలించారు. ఇదిలా ఉంటే భూ కొలతల్లో ఉత్తమ సేవలు అందించింనందుకు ఉత్తమ సర్వేయర్‌గా ఆయన 2012 ఏప్రిల్‌లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కిషోర్, సీసీఎల్ఏ ఏకే మహంతి, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా నుంచి అవార్డు అందుకోవడం గమనార్హం. సమాచారమందిస్తే చర్యలు: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగిన పక్షంలో తమకు కచ్చితమైన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు తెలిపారు. రాపూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 94404 46184, 94404 46185-189 నంబర్లలో తమను సంప్రదించవచ్చన్నారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, సుధాకర్, ఖుద్దూస్, షపీ, ఫణి,సత్యనాథ్ తదితరులు ఉన్నారు. - భాస్కర్‌రావు, డీఎస్పీ విసిగిపోయా: నేను సాగుచేసుకుంటున్న పొలాన్ని సబ్‌డివిజన్ చేయమని పలుమార్లు ప్రాధేయపడ్డాను. లంచం ఇవ్వనిదే చేయడం కుదరదని సర్వేయర్ తేల్చి చెప్పాడు. అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేనని, తగ్గించాలని పదేపదే అడిగితే కొద్దిగా తగ్గించాడు. ఆయన తీరుతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. - బాలకృష్ణయ్య, రైతు ఎవరో చేసిన దానికి నేను బలయ్యా: పొలాన్ని సబ్‌డివిజన్ చేయకుండా గతంలో పనిచేసిన సర్వేయర్లు వేధించినట్టు తెలుస్తోంది. వారు మాట్లాడుకున్న లంచం మొత్తాన్ని నాకు ఇవ్వడంతో నేను బలయ్యాను. రైతును నేను వేధించలేదు, తిప్పుకోనూ లేదు. - వెంకటేశ్వర్లు, సర్వేయర్ -
గుట్టుగా గంజాయిసాగు
మానవపాడు, న్యూస్‌లైన్: మండలంలోని చెన్నిపాడు గ్రామంలో ఓ రైతు తన పొలంలో మిరప, పత్తి పంటల మధ్య గుట్టుగా అంతర్పంటగా సాగుచేస్తున్న గం జాయి మొక్కలను మంగళవారం అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. రెండెకరాల్లో సాగుచేసిన వీటి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని వారు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బోయ కటిక వెంకటేశ్వర్లు తన రెండెకరాల పొలంలో మిరప, పత్తిపంటలను సాగుచేస్తున్నాడు. అందులోనే గంజాయి మొ క్కలను నాటాడు. అ వి దాదాపు ఎనిమిది అడుగుల మేర పెరిగాయి. గంజా యి మొక్కలను కోతకోసి బయటకు పం పించే చివరి సమయంలో పోలీసులకు సమాచారమందిం ది. దీంతో అలంపూర్ సీఐ రాజు, మానవపాడు ఎస్సై మధుసూదన్‌గౌడ్, తహశీల్దార్ సైదులుగౌడ్ వారి బృందంతో మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. పంటపొలంలోనే గంజాయి చెట్లనుంచి విత్తనాలు, ఆకులను సేకరిస్తూ కనిపించిన రైతు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడనుంచి గంజాయి విత్తనాలు తెచ్చాడో, ఎక్కడికి సరఫరా చేస్తూ అమ్ముతున్నాడనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వర్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా ఒక్కడే గంజాయి దందా చేస్తున్నాడా? అనే కోణంలో కూడా రెండు బృందాలు విచారణ చేస్తున్నట్లు సమాచారం. గంజాయి సాగులో మానవపాడు కాగా, గతంలో మండలంలోని గోకులపాడు, బొంకూరు, పోతులపాడు గ్రామాల్లో కూడా గంజాయి సాగుచేస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల నవంబర్ 11న ఇటిక్యాల మండలంలో గంజాయి సాగుచేస్తున్న ఏడుగురిని పట్టుకుని కేసునమోదు చేశారు. ఇది జరిగి నెలరోజులు కాకముందే గంజాయి సాగు స్థానికంగా కలకలం రేపింది. కళ్లముందు మిరప, పత్తి పంటలు కనిపిస్తుంటే ఇందులోనే గంజాయి చెట్లు పెంచుతున్నారా? అని రైతుల భయపడిపోయారు. స్థానిక రైతులు గంజాయి మొక్కలను చూసి నివ్వెరపోయారు. ఈ దాడుల్లో ఇటిక్యాల ఎస్ఐ జయశంకర్, వీఆర్ఓ రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. దర్యాప్తు చేస్తున్నాం: సీఐ సుమారు రూ.15 నుంచి రూ.20 లక్షల విలువగల గంజాయి మొక్కలను స్వాధీనం చేస్తుకున్నామని, నిందితుడు బోయ కటిక వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ రాజు తెలిపారు. మానవపాడు మండలంలో ఇంతపెద్దఎత్తున గంజాయి సాగు కావడం ఇదే మొదటిసారి అని అన్నారు. విత్తనాల సరఫరా, అమ్మే ప్రక్రియ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. బోయ వెంకటేశ్వర్లుపై ఎన్డీపీఎస్ డ్రగ్స్ యాక్టు,సెక్షన్ 20 ఏ కింద కేసునమోదు చేశామన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు ఇంకా ఎక్కడైనా ఉంటే తమకు సమాచారమందించాలని పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. -
లాభదాయకంగా తీగజాతి కూరగాయల సాగు
కలిగిరి, న్యూస్‌లైన్: తీగజాతి కూరగాయలను పందిరికి అల్లించి సాగు చేస్తూ రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. తీగజాతి రకాలైన దొండ, బీర, కాకర, పొట్లకాయ వంటి కూరగాయల పంటలను సాగు చేయడానికి ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. వీర్నకొల్లుకు చెందిన ఎమ్మెస్సీ పట్ట భద్రుడైన మేదరమెట్ల వెంకటేశ్వర్లు అనే రైతు అధికారుల సూచన మేరకు పందిరిపై దొండ చెట్లను సాగు చేయడానికి ముందుకు వచ్చాడు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తన ఎకరం పొలంలో పందిరిళ్లను ఏర్పాటు చేసి దొండ సాగు చేపట్టాడు. ఉద్యాన శాఖ ఎకరానికి 50 శాతం రాయితీ వంతున రూ. 60 వేలు అందించింది. తొలి సంవత్సరమే రైతుకు పెట్టుబడులు వచ్చాయి. పందిరికి అల్లించిన దొండ మూడు సంవత్సరాల పాటు ఫలితాలిస్తోంది. పందిరిపై తీగజాతి కాయలను పండించడంతో పంటకు కలుపు బెడద ఉండదు. కాయలు వృథాగా పోవు. తక్కువ సమయంలోనే కాయలను కోసే అవకాశం ఉండటంతో కూలీల సంఖ్య తగ్గి ఖర్చులు తగ్గుతాయి. నాణ్యమైన కాయలను కోసి వెంటనే అమ్ముకోవడం వల్ల రైతులు లాభాలు ఆర్జించవచ్చు. చెట్లకు ఎరువులను వేయడం, పురుగు మందులు పిచికారీ చేయడం సులభంగా ఉంటుంది. కూరగాయల సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీతో విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది పలువురు రైతులు పందిరిపై కూరగాయలు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలను నాగిరెడ్డిపాళెంలో సంత లో అమ్ముకునే అవకాశం ఉండటంతో సాగు సులభమైంది.