మానవపాడు, న్యూస్‌లైన్: మండలంలోని చెన్నిపాడు గ్రామంలో ఓ రైతు తన పొలంలో మిరప, పత్తి పంటల మధ్య గుట్టుగా అంతర్‌పంటగా సాగుచేస్తున్న గం జాయి మొక్కలను మంగళవారం అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. రెండెకరాల్లో సాగుచేసిన వీటి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని వారు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బోయ కటిక వెంకటేశ్వర్లు తన రెండెకరాల పొలంలో మిరప, పత్తిపంటలను సాగుచేస్తున్నాడు.
అందులోనే గంజాయి మొ క్కలను నాటాడు. అ వి దాదాపు ఎనిమిది అడుగుల మేర పెరిగాయి. గంజా యి మొక్కలను కోతకోసి బయటకు పం పించే చివరి సమయంలో పోలీసులకు సమాచారమందిం ది. దీంతో అలంపూర్ సీఐ రాజు, మానవపాడు ఎస్సై మధుసూదన్‌గౌడ్, తహశీల్దార్ సైదులుగౌడ్ వారి బృందంతో మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. పంటపొలంలోనే గంజాయి చెట్లనుంచి విత్తనాలు, ఆకులను సేకరిస్తూ కనిపించిన రైతు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడనుంచి గంజాయి విత్తనాలు తెచ్చాడో, ఎక్కడికి సరఫరా చేస్తూ అమ్ముతున్నాడనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వర్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా ఒక్కడే గంజాయి దందా చేస్తున్నాడా? అనే కోణంలో కూడా రెండు బృందాలు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
గంజాయి సాగులో మానవపాడు
కాగా, గతంలో మండలంలోని గోకులపాడు, బొంకూరు, పోతులపాడు గ్రామాల్లో కూడా గంజాయి సాగుచేస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల నవంబర్ 11న ఇటిక్యాల మండలంలో గంజాయి సాగుచేస్తున్న ఏడుగురిని పట్టుకుని కేసునమోదు చేశారు. ఇది జరిగి నెలరోజులు కాకముందే గంజాయి సాగు స్థానికంగా కలకలం రేపింది. కళ్లముందు మిరప, పత్తి పంటలు కనిపిస్తుంటే ఇందులోనే గంజాయి చెట్లు పెంచుతున్నారా? అని రైతుల భయపడిపోయారు. స్థానిక రైతులు గంజాయి మొక్కలను చూసి నివ్వెరపోయారు. ఈ దాడుల్లో ఇటిక్యాల ఎస్‌ఐ జయశంకర్, వీఆర్‌ఓ రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
దర్యాప్తు చేస్తున్నాం: సీఐ
సుమారు రూ.15 నుంచి రూ.20 లక్షల విలువగల గంజాయి మొక్కలను స్వాధీనం చేస్తుకున్నామని, నిందితుడు బోయ కటిక వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ రాజు తెలిపారు. మానవపాడు మండలంలో ఇంతపెద్దఎత్తున గంజాయి సాగు కావడం ఇదే మొదటిసారి అని అన్నారు. విత్తనాల సరఫరా, అమ్మే ప్రక్రియ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. బోయ వెంకటేశ్వర్లుపై ఎన్‌డీపీఎస్ డ్రగ్స్ యాక్టు,సెక్షన్ 20 ఏ కింద కేసునమోదు చేశామన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు ఇంకా ఎక్కడైనా ఉంటే తమకు సమాచారమందించాలని పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.