మేళ్లచెర్వు, న్యూస్‌లైన్: కందిబండ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కందిబండ గ్రామ పరిధిలోని కోదాడ-మేళ్లచెర్వు రోడ్డు మెయిన్‌రోడ్డు నుంచి నల్లబండగూడెం వరకు రూ.కోటి 20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులను, గ్రామంలో నిర్మిస్తున్న అంతర్గత రోడ్డు పనులకు ఆయన బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో లో ఓల్టేజీ సమస్య పరిష్కరించేందుకు విద్యుత్ సబ్ స్టేషన్‌కు రూ.కోటి 20 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆ సబ్‌స్టేషన్ పనులు పూర్తి కావచ్చాయన్నారు.
గ్రామంలో అంతర్గత రోడ్డు పనులకు రూ.5 లక్షలు, తాగునీటికి రూ.10 లక్షలు, ఎస్సీ కమ్యూనీటి హాల్‌కు రూ.10 లక్షలు తన నిధుల నుంచి మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలకు ప్రహరీకి, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు, హౌసింగ్ శాఖ ప్రత్యేక అధికారి గోపిరెడ్డి వీరారెడ్డి, హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగాని నాగన్న, సర్పంచ్ రుక్కయ్య, బొబ్బా భాగ్యరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పత్తిపాటి అశ్వని లెనిన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ పి.సీతారామిరెడ్డి, బానోతు బాబు, కొండా వెంకటేశ్వర్లు, పి వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వీరబాబుల్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కందిబండలోని చెన్నకేశవస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ సీతారామిరెడ్డి, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
రోడ్డు పనులకు ఉత్తమ్ శంకుస్థాపన
Published Thu, Feb 13 2014 3:56 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement