గోపాలపురం, న్యూస్‌లైన్ : పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన హన్మకొండ పరిధిలోని వడ్డేపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. డీఎస్పీ దక్షిణమూర్తి, సుబేదారి సీఐ పృథ్వీరాజ్ కథనం ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన షరీఫ్(45) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చే స్తున్నాడు.
అయితే షరీఫ్‌కు వరుసకు బావమరిది అయ్యే ఆరీఫ్ కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా డబ్బుల విషయమై గొడవలు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల కాలంలో ఆ గొడవలు మరింత ముది రాయి. ఈ క్రమంలో షరీఫ్ బుధవారం వడ్డేపల్లి చర్చి సమీపంలోని ఎంజీపీ ఫంక్షన్ ప్లాజా వద్ద మధ్యాహ్నం స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అరీఫ్, అతడితో వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా షరీఫ్ తలపై గొడ్డలితో దాడిచేశారు.
అనంతరం కింద పడిపోయిన షరీఫ్ తలపై మళ్లీ బండరా యి ఎత్తివేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య షరీఫా, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ, సీఐలు తెలిపారు. ఇదిలా ఉండగా, మృతుడు షరీఫ్ టీఆర్‌ఎస్ తరపున గత కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయినట్లు స్థానికులు తెలిపారు.
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
Published Thu, Feb 20 2014 3:07 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement