Sheriff
-
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరు నెలల శిశువుతో సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి, ఆమె తల్లి(17) సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులకు కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. విసాలియాకు తూర్పున ఉన్న ఇన్కార్పొరేటెడ్ గోషెన్‌లో నివాసముంటున్న కుటుంబంపై ఉదయం 3:30 గంటలకు ఇద్దరు వ్యక్తులు అనేకసార్లు కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందిందని తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇద్దరిని వీధిలో, మరో వ్యక్తి ఇంటి గుమ్మం వద్ద కాల్చి చంపినట్లు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ముగ్గురు బాధితులు ఇంటి లోపల విగతా జీవిలుగా కనిపించారని తెలిపారు. వారిలో ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తుండగా మరణించారని పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నట్లు, ఈ కాల్పులు యాధృచ్చికంగా జరిపినవి కాదని, కుటుంబాన్ని టార్గెట్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అయితే మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్న అనుమానంతో గతవారం క్రితం ఆ నివాసంలో షెరీఫ్ అధికారులు నార్కోటిక్స్ సంబంధిత తనిఖీలు చేశారు. తనిఖీలు జరిపిన వారంరోజుల అనంతరం ఆ ఇంటిపై గుర్తుతెలియని ముఠా సభ్యులు దాడి చేశారు. కాల్పుల సమయంలో మరో ఇద్దరు వారికంటపడకుండా జాగ్రత్త పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
గోపాలపురం, న్యూస్‌లైన్ : పాత కక్షలతో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన హన్మకొండ పరిధిలోని వడ్డేపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. డీఎస్పీ దక్షిణమూర్తి, సుబేదారి సీఐ పృథ్వీరాజ్ కథనం ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన షరీఫ్(45) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చే స్తున్నాడు. అయితే షరీఫ్‌కు వరుసకు బావమరిది అయ్యే ఆరీఫ్ కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా డబ్బుల విషయమై గొడవలు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల కాలంలో ఆ గొడవలు మరింత ముది రాయి. ఈ క్రమంలో షరీఫ్ బుధవారం వడ్డేపల్లి చర్చి సమీపంలోని ఎంజీపీ ఫంక్షన్ ప్లాజా వద్ద మధ్యాహ్నం స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అరీఫ్, అతడితో వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా షరీఫ్ తలపై గొడ్డలితో దాడిచేశారు. అనంతరం కింద పడిపోయిన షరీఫ్ తలపై మళ్లీ బండరా యి ఎత్తివేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య షరీఫా, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ, సీఐలు తెలిపారు. ఇదిలా ఉండగా, మృతుడు షరీఫ్ టీఆర్ఎస్ తరపున గత కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయినట్లు స్థానికులు తెలిపారు.