భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్ర, నన్నయ యూనివర్సిటీల అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ (అక్నూ) ఉమెన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో రెండు రోజులుగా జరిగిన అథ్లెటిక్స్ పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు సభకు అక్నూ వీసీ జార్జివిక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. బాల్యం నుంచే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు.
తాను డీఎన్నార్ కళాశాలలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేశారు. సభకు కళాశాల అధ్యక్షుడు జీవీ నర్సింహరాజు అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), పాలకవర్గ ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్ యు.ధనపతి వర్మ, పీడీ భూపతిరాజు నరసింహరాజు, ఏయూ, అక్నూ పీడీలు శ్యాంబాబు, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఆహారం అందించిన వైఎస్సార్ సీపీ నాయకుడు పేకేటి శ్రీనుకు వీసీ జార్జివిక్టర్ జ్ఞాపిక అందించారు.
ఏయూ చాంపియన్లు..
తొమ్మిది బంగారు పతకాలు సాధించి ఏయూ మెన్ చాంపియన్‌షిప్‌ను విశాఖ వీఎంసీ కళాశాల, ఎనిమిది బంగారు పతకాలు సాధించి ఏయూ ఉమెన్ చాంపియన్‌షిప్‌ను విశాఖ ఎల్‌బీ కళాశాల విద్యార్థులు దక్కించుకున్నారు. ఫాస్టెస్ట్ మెన్‌గా విశాఖ వీఎంసీ కళాశాల క్రీడాకారుడు పి.గౌతమ్, ఫాస్టెస్ట్ ఉమెన్‌గా విశాఖ ఎల్‌బీసీ కళాశాల విద్యార్ధిని ఎస్.శ్రావణి నిలిచారు.
‘నన్నయ’ చాంపియన్లు..
ఏడు బంగారు పతకాలు గెలుచుకుని అక్నూ ఉమెన్ చాంపియన్‌షిప్‌ను ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల, ఐదు బంగారు పతకాలు సాధించి మెన్ చాంపియన్‌షిప్‌ను కాకినాడ ఐడియల్ కళాశాల విద్యార్థులు గెలుచుకున్నారు. ఫాస్టెస్ట్ మెన్‌గా ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకారుడు బి.లీలా వరప్రసాద్, ఫాస్టెస్ట్ ఉమెన్‌గా కాకినాడ ఐడియల్ కళాశాల క్రీడాకారిణి ఎన్.శివజ్యోతి నిలిచారు.
భీమవరంలో ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
Published Wed, Dec 11 2013 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement