మహబూబ్‌నగర్ వైద్యవిబాగం, న్యూస్‌లైన్: జిల్లాలో మొట్టమొదటి సారిగా టెస్టుట్యూబ్ ద్వారా ఓ జంటకు సంతానం కలిగించారు. జిల్లా కేంద్రంలోని సుశృత సంతానసాఫల్య కేంద్రం ద్వారా గురువారం తొలిసారిగా టెస్టుట్యూబ్ వైద్యవిధానం ద్వారా ఓ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పి. ప్రతిభ శిశువు వివరాలను వెల్లడించారు. బొంరాస్‌పేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు గత పదేళ్లక్రితం వివాహమైంది. వారికి సంతానం కలగలేదు. దీంతో వారు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి.. వేల రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది.
చివరికి ఆ దంపతులు జిల్లాకేంద్రంలోని సుశృత సంతాన సాఫల్యకేంద్రాన్ని ఆశ్రయించారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ప్రతిభ నేతృత్వంలో వైద్యులు ఆ దంపతులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు ప్రారంభించారు. గురువారం టెస్టుట్యూబ్ ప్రక్రియ ద్వారా ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా టెస్టుట్యూబ్ ద్వారా సంతానం కలగడం విజయంగా భావిస్తున్నామని డాక్టర్ ప్రతిభ ఆనందం వ్యక్తంచేశారు. శిశువు ఆరోగ్యం చాలా బాగుందని వెల్లడించారు. సంతానప్రాప్తి కలిగిన ఆ దంపతులు ఈ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రయోగం ఫలించింది!
Published Fri, Nov 1 2013 4:02 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement