ప్రాణం పోయినా.. భూములివ్వం | the formers not interst land pooling | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయినా.. భూములివ్వం

Published Tue, Mar 29 2016 1:32 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

ప్రాణం పోయినా.. భూములివ్వం - Sakshi

ప్రాణం పోయినా.. భూములివ్వం

 ఆర్డీవోకి తేల్చిచెిప్పిన తొండపి గ్రామస్తులు
 
తొండపి(ముప్పాళ్ళ
): ప్రాణం పోయినా.. భూములు ఇచ్చేది లేదని తొండపి గ్రామస్తులు ఆర్డీవో భాస్కరనాయుడుకు తెగేసి చె ప్పారు. మండలంలోని తొండపిలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 400 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణలో భాగంగా ఆర్డీవోతో పాటు తహసీల్దారు సోమవారం గ్రామంలో పర్యటించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు భూములు ఇవ్వమని చెప్పారు. పంట పండే భూములను స్వాధీనం చేసుకుంటే తమ జీవనం సాగదన్నారు.

దీంతో చేసేదేంలేక అధికారులు వెనుదిరిగారు. వారి వెంట ఆర్.ఐ సత్యం, సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వో రత్నకుమారి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. గ్రామంలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మించనున్న సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణపై రైతులతో మాట్లాడేందుకు మంగళవారం కలెక్టర్ కాంతిలాల్ దండే రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement