కల్యాణ వెంకన్నకు బంగారు హస్తాల కానుక | The gift of a golden hand to Kalyani Venkanna | Sakshi
Sakshi News home page

కల్యాణ వెంకన్నకు బంగారు హస్తాల కానుక

Mar 3 2016 12:40 AM | Updated on Sep 3 2017 6:51 PM

చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి బుధవారం సుమారు 6.5 లక్షల విలువైన ...

చంద్రగిరి:చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి బుధవారం సుమారు 6.5 లక్షల విలువైన బంగారు హస్తాలు కానుకగా అందాయి. కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు పూనె రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త రవి బంగారు కఠి, వరద హస్తాలను తయారుచేయిస్తానని మొక్కుకున్నారు.

ఆమేరకు చెన్నైలోని ఎన్.ఆంజనేయులు శెట్టి జ్యుయెలర్స్‌లో 220 గ్రాముల బంగారంతో హస్తాలను తయారు చేయించారు. బుధవారం ఆంజనేయులు శెట్టి జ్యువెలర్స్ నిర్వాహకులు శ్రీనివాసమంగాపురం చేరుకుని ఆలయంలో డెప్యూటీ ఈవో వెంకటయ్యకు బంగారు హస్తాలను అందజేశారు. వాటి విలువ సుమారు 6.5 లక్షల ఉంటుందని తెలిపారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement