షెడ్యూల్ కులాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని, వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేస్తున్నామని మన పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తిదేనని తేలిపోరుుంది. వీరి మాటలు పత్రికలకే పరిమితమని నిర్ధారణ అయింది. రోజుకోసారైనా ఎస్సీల సంక్షేమం అంటూ మంత్రులు, అధికారులు చెప్పే మాటలన్నీ వాస్తవాలు కావని జిల్లాలోని షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా గత ఏడాది మంజూరైన పథకాల రుణాల వివరాలు పరిశీలిస్తే తేలింది. వివరాల్లోకి వెళ్తే...
* అవగాహనా లోపమే కారణం
* మరోవైపు నిబంధనల అడ్డుకట్ట...
శ్రీకాకుళం పాతబస్టాండ్ : షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా ఎస్సీ కులస్తులకు మంజూరు చేసే పలు పథకాలకు సంబంధించి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. పథకాల మంజూరీలో ప్రభుత్వ జాప్యంతో పాటు పథకాల నిర్వహణకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా కొందరు దరఖాస్తు చేసుకున్నా నిబంధనల పేరిట అడ్డుకట్ట వేస్తుండడంతో లక్ష్య సాధనలో ఆ శాఖ వెనుకబడుతుంది.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు లబ్ధి చేకూర్చే ఎనిమిది పథకాలు ప్రస్తుతం ఉన్నారుు. వీటిలో ఒకటి రెండు పథకాలు మినహా, మిగిలిన పథకాలు ఎస్సీల చెంతకు చేరే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాల తీరును ఓసారి పరిశీలిస్తే...
* సబ్సిడీపై బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు ఉత్పాదకత ప్రయోజన యూనిట్లు 1143 మంజూరు చేసి అందుకుగాను రూ.12,91,68,000లు ఖర్చు చేయూలని నిర్ణరుుంచింది. అరుుతే 871 యూనిట్లకుగాను రూ.10,92,37,000లను మంజూరు చేశారు. వీరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో రాయితీ నగదు పడనుంది. మిగిలిన యూనిట్లకి లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు.
* బ్యాంకు రుణంతో పని లేకుండా నేరుగా ఎస్సీ కార్పొరేషన్ పలువురు ఎస్సీ లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు అందజేయూల్సి ఉంది. దీనిలో భాగంగా 107 యూనిట్లకుగాను రూ.1,52,16,000లు మంజూరుకు నిర్ణరుుంచింది. వీటిలో ఇప్పటి వరకు 43 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యూరుు. వీటికి సంబంధించి రూ.72,30,000లు మంజూరు చేసింది. మిగిలిన యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులే కరువయ్యూరు.
* భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ రైతులకు నేరుగా కార్పొరేషన్ భూములు కొనుగోలు చేసి ఇస్తుంది. 254 మంది లబ్ధిదారులకు ఇలా గత ఆర్థిక సంవత్సరంలో అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద ప్రయోజనం చూకూరలేదు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల కొరత అటుంచితే భూములు విక్రయించే రైతులు ముందుకు రాలేదు. దీంతో ఈ పథకం కాస్త నీరుగారింది.
* ఎస్సీ కులాల బోరు బావి పథకం కింద 397కి రూ.1,58,50,000లు అందజేయాల్సి ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోలేదు.
* ఎస్సీల్లో పేదలకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తారు. వీటికిగాను రూ.25వేలు యూనిట్ వంతునా 39 మందికి లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇప్పటి వరకు తొమ్మిది మందికి మాత్రమే ఈ రుణాలు అందజేశారు.
* వృత్తి ఉపాధి శిక్షణ పథకం క్రింద 303 మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. వీరు విజయవాడలోని శిక్షణ పొందుతున్నారు. అనంతరం ఉద్యోగం ఇప్పిస్తారు.
* ఇన్నోషియేటివ్ పథకం కింద వికలాంగులకు, ఎయిడ్స్, యుక్త వయస్సులోని పిల్లలు గల వితంతువులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేయూల్సి ఉంది. ఈ పథకం ద్వారా ఒకరికి రూ.40వేలు ఉపాధి ప్రోత్సాహం కింద ఇస్తారు. దీనికి 39 మందికి లక్ష్యంగా నిర్ణయించగా 28 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 మందికి రూ.8,80,000లు అందజేశారు.
లబ్ధిదారులు ముందుకు రావాలి...
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది. పథకాలు అన్నింటిపైనా అవగాహన కల్పింస్తున్నాం. దర ఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నిబంధనలు మేరకు రుణాలు, ఇతర పథకాల అందజేస్తున్నాం. ఇప్పటికే దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. ఈ ఏడాది మరింత అధికంగా ఈ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- కేవీ ఆదిత్యలక్ష్మి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
లక్ష్యం ఘనం... సాధించింది శూన్యం!
Published Sat, Apr 16 2016 1:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement