Bore well scheme
-
ఇప్పుడెందుకో?
సాక్షి, సిటీబ్యూరో: కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏ విభాగమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. వర్షాకాలానికి ముందైతే నాలాల్లో పూడికతీత, రోడ్ల మరమ్మతులు తదితర పనులు చేయాలి. అదే వేసవికి ముందైతే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా వాటర్ ఏటీఎంలు, బోర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేయాలి. కానీ తీరా సమయం ముంచుకొచ్చే వరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ఆ తర్వాత హడావుడి చేయడం జీహెచ్ఎంసీకి అలవాటైంది. దీంతో ఆ పనులు పూర్తిచేసే లోపు సీజన్ ముగిసిపోతోంది. ఇంకొన్ని రోజుల్లో వేసవి ముగియనుండగా ఇప్పుడు బోర్ల మరమ్మతులు చేపట్టడమే ఇందుకు తాజా ఉదాహరణ. వాస్తవానికి ఎండాకాలానికి ముందే వేసవి కార్యాచరణలో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల వేసవి సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలు కమిషనర్ దానకిశోర్ దృష్టికి రావడంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వాటర్ ఏటీఎంలు పనిచేసేలా చర్యలుతీసుకోవడంతో పాటు ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్ సిగ్నళ్లు, కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లూ కెఫెల్లోనూ ఉచితంగా తాగునీరు అందించాలన్నారు. వీటితో పాటు గ్రేటర్ పరిధిలోని 2,283 బోర్వెల్స్, 2,555 పవర్ బోర్వెల్స్ అన్నీ పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాస్తవానికి మార్చిలోగానే ఈ పనులు చేయాల్సింది. ఇప్పుడు పనులు చేపట్టడం వల్ల అవి ఎప్పటికి పూర్తవుతాయో? భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల మరమ్మతులు చేపట్టినా ఫలితం ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి. ఇక వీటి మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. గత మూడేళ్లుగా బోర్ల నిర్వహణ పేరుతో ఏటా దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పవర్ బోర్లకు విద్యుత్ చార్జీలు అదనం. అధికారుల సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 2,555 పవర్ బోర్లుండగా... వాటిలో 818 పని చేయడం లేదు. 2,283 హ్యాండ్ బోర్వెల్స్కు గాను 1,086 పని చేయడం లేదు. -
అవినీతి లొల్లి.. కట్టాలా పట్టం మళ్లీ
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ నుంచి వలస వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ... విజయపతాకం ఎగురవేసి ... ఏకంగా కొండలనే కొల్లగొట్టి రూ. కోట్ల ఆర్జనకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారనుకుంటే అడుగడుగునా ఆయనతోపాటు ఆయన అనుచరులు అందినకాడికి దోచుకొని నియోజకవర్గ ప్రజలను దగా చేశారన్న విమర్శలున్నాయి. పెద్దాపురం మండలం ఆనూరు, కొండపల్లి, కొండలను గుల్ల చేసి గ్రావెల్ తవ్వకాలు జోరుగా చేశారు. ప్రతి రోజు వందలాది వాహనాలలో గ్రావెల్ రవాణా జరగడంతో ఆయా ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రకృతి ఇచ్చిన సంపదను కాపాడాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారి పోయారని ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కొండలను కొల్లగొట్టి రూ.200 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా ఏకధాటిగా సాగుతున్న కొండల తవ్వకాలపై ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దళితుల పొట్టకొడుతూ... పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని తవ్వకాలు దౌర్జన్యంగా చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వాలుగా ఉన్న కొండను తవ్వి చదును చేయడంతో రెండు వంతుల భూమిని దళితులు కోల్పోయే అవకాశం ఉంది. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటిచుట్టూ కూడా గ్రావెల్ తవ్వకాలు చేపట్టేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న 800 ఎకరాల భూమిని పేద దళితులకు పంపిణి చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో 530 ఎకరరాల భూమిని ఒక్కో కుటుంబానికి ఎకరం 35 సెంట్ల చొప్పున పంపిణి చేశారు. పంటలకు అనువుగా వైఎస్ హయాంలో బోర్ల ఏర్పాటు... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జలప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఎకరానికి రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చేదని రైతులు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతి నెలా రూ.1500 నుంచి మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములున్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ కొండలో తవ్వకాలు చేస్తున్నా అధికారులు మౌనం వహించడమేమిటని పరిసర ప్రాంత జనం ప్రశ్నిస్తున్నారు. దాదాపు పది పొక్లెయిన్లతో 24 గంటలపాటు తవ్వకాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో అదే రీతి... నియోజకవర్గ పరిధిలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి చేశామని చినరాజప్ప తరచుగా చెబుతున్నారని, అందులో అవినీతి భాగం ఎక్కువగా ఉందనే విమర్శలూ లేకపోలేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. రూ.కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి తొంగిచూస్తోంది. రేకులతో నిర్మాణం చేసి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక ‘నీరు చెట్టు’ పథకం అవినీతికి మరో మెట్టుగా మారిపోయింది. సామర్లకోట నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. రేకుల షెల్టర్లకు రూ. ఐదు లక్షలా! ఐదు నుంచి ఆరుగురు ప్రయాణికులు వేచి ఉండటానికి వీలుగా రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కో షెల్టర్కు రూ. ఐదు లక్షలు ఖర్చు చేసినట్లు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టరుకు రూ.ఐదు లక్షలా అనే విమర్శలున్నాయి. ఇటువంటివి పెద్దాపురంలో మూడు నిర్మాణం చేసి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అనధికార లేఅవుట్ల జోరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలోనూ అనధికార లే అవుట్లు జోరందుకున్నాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసినవారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కాకపోవడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారని పరిసర గ్రామాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. -
లక్ష్యం ఘనం... సాధించింది శూన్యం!
షెడ్యూల్ కులాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని, వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేస్తున్నామని మన పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తిదేనని తేలిపోరుుంది. వీరి మాటలు పత్రికలకే పరిమితమని నిర్ధారణ అయింది. రోజుకోసారైనా ఎస్సీల సంక్షేమం అంటూ మంత్రులు, అధికారులు చెప్పే మాటలన్నీ వాస్తవాలు కావని జిల్లాలోని షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా గత ఏడాది మంజూరైన పథకాల రుణాల వివరాలు పరిశీలిస్తే తేలింది. వివరాల్లోకి వెళ్తే... * అవగాహనా లోపమే కారణం * మరోవైపు నిబంధనల అడ్డుకట్ట... శ్రీకాకుళం పాతబస్టాండ్ : షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ద్వారా ఎస్సీ కులస్తులకు మంజూరు చేసే పలు పథకాలకు సంబంధించి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. పథకాల మంజూరీలో ప్రభుత్వ జాప్యంతో పాటు పథకాల నిర్వహణకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా కొందరు దరఖాస్తు చేసుకున్నా నిబంధనల పేరిట అడ్డుకట్ట వేస్తుండడంతో లక్ష్య సాధనలో ఆ శాఖ వెనుకబడుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు లబ్ధి చేకూర్చే ఎనిమిది పథకాలు ప్రస్తుతం ఉన్నారుు. వీటిలో ఒకటి రెండు పథకాలు మినహా, మిగిలిన పథకాలు ఎస్సీల చెంతకు చేరే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాల తీరును ఓసారి పరిశీలిస్తే... * సబ్సిడీపై బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు ఉత్పాదకత ప్రయోజన యూనిట్లు 1143 మంజూరు చేసి అందుకుగాను రూ.12,91,68,000లు ఖర్చు చేయూలని నిర్ణరుుంచింది. అరుుతే 871 యూనిట్లకుగాను రూ.10,92,37,000లను మంజూరు చేశారు. వీరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో రాయితీ నగదు పడనుంది. మిగిలిన యూనిట్లకి లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు. * బ్యాంకు రుణంతో పని లేకుండా నేరుగా ఎస్సీ కార్పొరేషన్ పలువురు ఎస్సీ లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు అందజేయూల్సి ఉంది. దీనిలో భాగంగా 107 యూనిట్లకుగాను రూ.1,52,16,000లు మంజూరుకు నిర్ణరుుంచింది. వీటిలో ఇప్పటి వరకు 43 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యూరుు. వీటికి సంబంధించి రూ.72,30,000లు మంజూరు చేసింది. మిగిలిన యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులే కరువయ్యూరు. * భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ రైతులకు నేరుగా కార్పొరేషన్ భూములు కొనుగోలు చేసి ఇస్తుంది. 254 మంది లబ్ధిదారులకు ఇలా గత ఆర్థిక సంవత్సరంలో అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద ప్రయోజనం చూకూరలేదు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల కొరత అటుంచితే భూములు విక్రయించే రైతులు ముందుకు రాలేదు. దీంతో ఈ పథకం కాస్త నీరుగారింది. * ఎస్సీ కులాల బోరు బావి పథకం కింద 397కి రూ.1,58,50,000లు అందజేయాల్సి ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోలేదు. * ఎస్సీల్లో పేదలకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తారు. వీటికిగాను రూ.25వేలు యూనిట్ వంతునా 39 మందికి లక్ష్యంగా నిర్ణరుుంచారు. ఇప్పటి వరకు తొమ్మిది మందికి మాత్రమే ఈ రుణాలు అందజేశారు. * వృత్తి ఉపాధి శిక్షణ పథకం క్రింద 303 మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. వీరు విజయవాడలోని శిక్షణ పొందుతున్నారు. అనంతరం ఉద్యోగం ఇప్పిస్తారు. * ఇన్నోషియేటివ్ పథకం కింద వికలాంగులకు, ఎయిడ్స్, యుక్త వయస్సులోని పిల్లలు గల వితంతువులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేయూల్సి ఉంది. ఈ పథకం ద్వారా ఒకరికి రూ.40వేలు ఉపాధి ప్రోత్సాహం కింద ఇస్తారు. దీనికి 39 మందికి లక్ష్యంగా నిర్ణయించగా 28 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 22 మందికి రూ.8,80,000లు అందజేశారు. లబ్ధిదారులు ముందుకు రావాలి... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది. పథకాలు అన్నింటిపైనా అవగాహన కల్పింస్తున్నాం. దర ఖాస్తు చేసుకున్న ప్రతి వారికి నిబంధనలు మేరకు రుణాలు, ఇతర పథకాల అందజేస్తున్నాం. ఇప్పటికే దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. ఈ ఏడాది మరింత అధికంగా ఈ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. - కేవీ ఆదిత్యలక్ష్మి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్