గూడూరు రూరల్: ఆదర్శ గ్రామం పుట్టంరాజువారి కండ్రిగలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా సుమారు 40 మంది జ్వరాల బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది కీళ్లనొప్పులు, నీరసంతో మంచాలకే పరిమిత మయ్యారు.
నాలుగు రోజుల క్రితమే డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గ్రామాన్ని సందర్శించి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే జ్వరాలు ప్రబలుతుండటం గమనార్హం. మరోవైపు నెర్నూరు ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు గొల్లపల్లిలోనూ పలువురు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గొల్లపల్లికి చెందిన ఓ వ్యక్తిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో చెన్నైకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. చెన్నూరు పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ సునీల్ స్పందిస్తూ జ్వరాలు ప్రబలుతున్న విషయం వాస్తవమేనని, బుధవారం ఇంటింటికి వెళ్లి మందులను అందించామన్నారు. గురువారం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పీఆర్ కండ్రిగలో ప్రబలిన విషజ్వరాలు
Published Thu, Dec 25 2014 2:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement