విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం టీములబండ గ్రామంలోని గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కి చెందిన సరుకుల డిపోను మావోయిస్టులు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన సుమారు 15 మంది మావోయిస్టులు కుంకుమపూడి గ్రామంలో నిర్వహించాల్సిన జీసీసీ డిపోను టీములబండలో ఏర్పాటు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని అక్కడ గుమికూడిన గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు జీసీ గోదాము తలుపులను, పైకప్పు రేకులను పగులగొట్టి వెళ్లిపోయారు. అయితే, గోదాములో సరుకులు ఏమీలేవని, వాటిని అప్పటికే తరలించారని సమాచారం.