
ఆధునికీకరణ అంతంతే!
సాగర్ కాలువ పనుల్లోనాణ్యత లోపాలు
మరమ్మతుల దశలోనేఊడిపోతున్న సిమెంటు
ఎగుడుదిగుడుగాకాలువ గోడల నిర్మాణం
ఈపూరు: సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఊడిజర్ల 110-111 మైలురాయి వద్ద కాలువ డీప్‌కట్ షాట్ క్రీటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పైపు పనులు చేస్తుండగా మరో వైపు ప్లాస్టింగ్ ఊడిపోవడం పనుల్లో నాణ్యత లోపించడాన్ని తెలియజేస్తోంది.
సాగర్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా 11వ ప్యాకే జీ కింద బొమ్మరాజుపల్లి కాలువ నుంచి బొల్లాపల్లి మం డలంలోని 85 కిలోమీటరు వరకు చేపట్టే పనులకు సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు. దాదాపు నెల కిందట ప్రారంభమైన ఈ పనులు నేటికీ కొనసాగుతున్నాయి.
మంజూరైన నిధులతో శిధిలమైపోతున్న కాలువ కట్టల పునఃనిర్మాణం, డీఫ్‌కట్‌లలో లైనింగ్, బెడ్, కాలువకు ఇరువైపుల వాల్స్ నిర్మాణం తదితర పనులతో పాటు, కాలువల్లో సిల్ట్ తొలగింపు, యూటీ, ఎస్కేప్‌ల రిపేర్లు తదితర పనులు చేయాల్సి ఉంది.{పస్తుతం షాట్‌క్రీటింగ్ పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవే క్షణ లేకపోవడం వల్ల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని అంటున్నారు.{పధానంగా షాట్ క్రీటింగ్ పనులకు ఇసుక వాడకం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని అంటున్నారు.
కాలువ కట్టల గోడలు ఒకే లెవల్‌లో లేకపోవడంతో పలు చోట్ల నిర్మాణాలు ఎగుడుదిగుడుగా కనిపిస్తున్నాయి.
పలు చోట్ల ఐరన్‌మెస్‌లు ఏర్పాటు చేయకుండా సిమెంటు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అంచనా ప్రకారం జరగాల్సిన పనులు ఇష్టానుసారంగా చేయడం, పర్యవే క్షణ లోపించడం వల్ల నాణ్యత కనిపించడంలేదు.ఈపూరు మండల పరిధిలో జరుగుతున్న సాగర్ ఆధునికీకరణ పనులను క్వాలిటీ అధికారులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు.కాలువలో పూడిక తీయకుండానే షాట్ క్రీటింగ్ పనులు చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది.
జరుగుతున్న పనులను అధికారులు తక్షణమే పరిశీలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.క్వాలిటీ అధికారులు పరిశీలిస్తున్నారు..
ఈ విషయమై ఎన్‌ఎస్పీ డీఈ రాజయ్యను వివరణ కోరగా, క్వాలిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సిబ్బంది పర్యవేక్షణ ఉంది. ఎక్కడా అవినీతి జరగడం లేదు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయి. కాలువలో కొన్ని చోట్ల తరువాత కూడా సిల్ట్ తీసే అవకాశం ఉంది. సిల్ట్ తీసిన తరువాత కొరవడిన పనులు చేస్తారని ఆయన వివరించారు.