sagar canal
-
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
పుట్టుకతోనే కళ్లు లేని కొడుకు.. పేగు బంధాన్ని మరచిన కన్నతల్లి..
మిర్యాలగూడ: ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి అంధుడైన కుమారుడిని సాగర్ ఎడమ కాల్వలోకి తోసేసింది. దీంతో ఆ బాలుడు గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల సోములు, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. ఎనిమిదేళ్ల క్రితం భర్త సోములు చనిపోవడంతో శైలజ కొంతకాలంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో ముగ్గురు కుమారులైన రాజు, గోపీచంద్ (14), యోగేశ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడే పలువురి ఇళ్లల్లో పనిచేస్తూ కుమారులను పోషిస్తోంది. మొదటి కుమారుడు రాజు నల్లగొండ లో ఇంటర్ మొదటి సంవత్సరం, మూడో కుమారుడు యోగేశ్ 4వ తరగతి చదువుతున్నారు. రెండో కుమారుడైన గోపీచంద్ పుట్టుకతో అంధుడు కావడంతో నల్లగొండ పట్టణంలోని బధిరుల పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. గోపీచంద్ వయస్సు పెరుగుతున్నకొద్దీ మానసిక స్థితిని కోల్పోతూ తోటి విద్యార్థులను గాయపరుస్తుండటంతో ఈ విద్యా సంవత్సరం బాలుడిని చేర్పించుకునేందుకు ఇష్టపడలేదు. సాగర్ ఎడమ కాల్వ వంతెన దగ్గర బాలుడిని తోసేసి.. బాలుడి చేష్టలతో విసుగు చెందిన తల్లి.. అతడిని తీసుకొని శనివారం నల్లగొండ నుంచి బస్సులో బయలుదేరింది. వేములపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ వంతెన సమీపంలో కుమారుడు గోపీచంద్‌ను నీటిలోకి తోసేసింది. అక్కడ ఈత కొడుతున్న ఇద్దరు యువకులు ఇది గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. వాళ్లు వెంటనే శైలజను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి కోసం గాలిస్తున్నారు. -
సంతోషంగా మేడారం వెళ్లొచ్చారు.. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉన్నాయని..
సాక్షి, ఖమ్మం: కుటుంబంతో సహా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించి సరదాగా గడిపి వచ్చారు. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉండడంతో దంపతులిద్దరూ కలిసి సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు కాలు జారి భార్య కాల్వలో పడి కొట్టుకుపోతుండగా.. కాపాడేందుకు దిగిన భర్త ఇద్దరూ ప్రవాహంలో మునిగారు. పోలీసులు, ఈతగాళ్లు చేపట్టిన గాలింపుల్లో భార్య మృతదేహం లభించగా, భర్త కోసం గాలింపు కొనసాగుతోంది. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడుకు చెందిన ఆరెంపుల పరశురాం – నందిని(25) భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు సుమశ్రీ, యశ్వంత్ ఉన్నారు. పరశురాం తాపీ మేస్త్రీ పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉంటోంది. వీరు మేడారంలో మొక్కు చెల్లించుకోవడానికి ఈనెల 15న వెళ్లి 17న తిరిగి వచ్చారు. ఇంట్లో ఉతకాల్సిన ఎక్కువగా బట్టలు ఉండటంతో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు కూతురు సుమశ్రీని తీసుకుని ముత్తగూడెం – పల్లెగూడెం గ్రామాల నడుమ ఉన్న సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై ఉంచి బట్టలు ఉతుకుతుండగా నందిని ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయింది. దీంతో హతాశుడైన పరశురాం ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దూకాడు. ఈత వచ్చిన ఆయన కొట్టుకుపోతున్న భార్యను కాపాడే యత్నంలో నందిని భర్త మెడ పట్టుకోవడంతో ఊపిరి ఆడక ఇద్దరూ మునిగి కొట్టుకుపోసాగారు. చదవండి: హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని... తల్లిదండ్రులు కానరాకపోవడంతో బేల చూపులు చూస్తున్న చిన్నారులు ఈ విషయాన్ని గుర్తించిన వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించింది. పరశురాం ఆచూకీ కోసం ఇంకా కాల్వలో వెతుకుతున్నారు. కాగా, ఇదిలా ఉండగా కాల్వలో పడి తల్లి మృతి చెందడం, తండ్రి జాడ తెలియకపోవడంతో వీరి పిల్లలిద్దరు అమ్మానాన్న ఏరీ అంటూ బేల చూపులు చూస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది. -
సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. బాలుడిని కాపాడే కంగారులో ఈత రాకున్నా..
సాక్షి, ఖమ్మం: నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ లో దానవాయిగూడెం వద్ద ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోని అభయ్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి శాఖల్లో పనిచేసే కేరళకు చెందిన ఏడుగురు వారాంతంలో భాగంగా ఖమ్మంలో కలుసుకున్నారు. సరదాగా సాగర్ కాల్వలో ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు. కోదాడ నుంచి వచ్చిన ప్రదీప్, షాజీ, సూర్యాపేట నుంచి వచ్చిన అభయ్ సంతోష్, ఖమ్మంలో ఉన్న పరకాల సోను, వివేక్, షిబ్బు తోపాటు, ఖమ్మం మేనేజర్ సోను కుమారుడైన 11 సంవత్సరాల బాలుడు షారోన్ కలిసి అదివారం సరదాగా ఈతకు వెళ్లారు. ప్రదీప్, షాజీ, షిబ్బులు ఈతకోసం కాల్వలో దిగారు. మిగిలినవారు ఒడ్డున కూర్చున్నారు. బాలుడు షారోన్ ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. చదవండి: ('అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత) ఇది గమనించిన తండ్రి పరకాల సోను దూకగా..ఈత రాకున్నా కాపాడే కంగారులో వివేక్, అభయ్ సంతోష్‌లు కూడా కాల్వలోకి దూకారు. పిల్లాడిని ప్రదీప్ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. తండ్రి సోనును ఈతరాని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఖానాపురం హవేలి ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. -
సాగర్ కాలువలో రేణుకా చౌదరి పీఏ గల్లంతు!
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ప్రధాన అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాడిగా పేరుపొందిన అతడు గల్లంతవడం షాకింగ్‌గా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గత ఈతగాళ్లను రప్పించి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతడికి గుండెపోటు రావడంతో కాలువలో గల్లంతై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా రవి గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడి (పీఏ) గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 11 కిలోమీటర్లు నిర్విరామంగా రవి ఈత కొడతాడని స్థానికులు చెబుతున్నారు. సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన అనంతరం రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఆ సమయంలో అతడు కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు రవి కోసం సాగర్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా రవి ఆచూకీ లభించలేదు. కాలువ సమీపంలో రవికి చెందిన బుల్లెట్ వాహనం, చెప్పులు, బ్యాగ్ ఉన్నాయి. -
సాగర్ కాలువలో బాలుడి గల్లంతు
ప్రకాశం, త్రిపురాంతకం: సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన బాలుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన సాగర్ కాలువలో మంగళవారం జరిగింది. బాలుడి ఆచూకీ కోసం సాగర్ కాలువలో గాలిస్తున్నారు. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన దూదేకుల కాశిం (16) పదో తరగతి చదువుతున్నాడు. సరదాగా తోటి స్నేహితులతో కలిసి త్రిపురాంతకం సాగర్ కాలువకు ఈత కొట్టేందుకు వచ్చాడు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా మునిగి పోవడం చూసి మిగిలిన ముగ్గురు స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రక్షించే ప్రయత్నం చేసిన వారిలో మరొకరు మునిగిపోబోయారు. పిల్లల కేకలు విని అటుగా వచ్చిన ట్రాక్టర్‌లోని కొందరు తాడు వేసి మునిగిపోబోతున్న బాలుడిని రక్షించారు. కాశిం అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు, స్థానికులు, బంధువులు అక్కడకు చేరుకుని సత్వర చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈతగాళ్లను పిలిపించి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కాశిం ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి హుస్సేన్ యర్రగొండపాలెంలో ముఠామేస్త్రిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండగకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాశిం ఇంతలోనే ప్రమాదంలో చిక్కుకున్నాడు. -
మరమ్మతుకు కసరత్తు
ఖమ్మంఅర్బన్: సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నెస్పీ ఆయకట్టుకు యాసంగిలో నీటి సరఫరా పూర్తయింది. దీంతో అత్యవసరంగా చేపట్టాల్సిన కాల్వల మరమ్మతు పనులపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో తొలి విడతగా రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆయా డివిజన్ల పరిధిలో అధికారులు టెండర్ల ప్రక్రియపై దృష్టి పెట్టారు. గతంలో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన వాటి పరిధిలో మిగిలిపోయిన.. చేపట్టని ప్రాంతాల్లో పనులను గుర్తించి అంచనాలు రూపొందించగా.. వాటిలో కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. ప్రధాన కాల్వతోపాటు మేజర్, మైనర్ కాల్వలపై పేరుకుపోయిన కంప చెట్లు, పూడికతీత, దెబ్బతిన్న కట్టల మరమ్మతు తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 8 పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వాటికి సర్కిల్, డివిజన్ పరిధిలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం డివిజన్లో గతంలో తయారు చేసిన అంచనాల ప్రకారం పనులకు నిధులు మంజూరు కాలేదు. అయితే మరోసారి అంచనాలు తయారు చేసి పంపుతున్నట్లు ఎన్నెస్పీ ఈఈ తెలిపారు. మానిటోరింగ్ డివిజన్ పరిధిలో కూడా మరమ్మతులు చేయాల్సిన వాటిని గుర్తించి.. అంచనాలు పంపారు. వాటిలో రూ.10లక్షల నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం సర్కిల్ పరిధిలోని 17 మండలాల్లో సుమారు 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు అంతరాయం లేకుండా వచ్చే వర్షాకాలం నాటికి నీరందించే విధంగా ఎన్నెస్పీ అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నెస్పీ ఎస్ఈ సుమతీదేవి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ రెండు నెలల కాలంలో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే కల్లూరు డివిజన్ పరిధిలోని పేరువంచ మేజర్ కాల్వ మరమ్మతు, ఇంకా మధిర బ్రాంచి కాల్వ, జమలాపురం, మైలవరం మేజర్లపై పనులు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు.. వచ్చే జూన్ నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా.. సాగర్ డ్యాంలోకి అనుకున్న మేరకు నీరు చేరితే ఆగస్టులో విడుదల చేస్తారు. ఎక్కడైనా మరమ్మతు పనులు చేయాల్సి ఉంటే.. ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా టెండర్లు పూర్తి చేసి.. పనులు మొదలు పెట్టి.. రైతులకు కాల్వల ద్వారా సమృద్ధిగా నీరందించేందుకు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. టెండర్లు పిలుస్తున్నాం.. అత్యవసర పనులను గుర్తించి అంచనాలు పంపించాం. వాటిలో 8 పనులకు సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వాటికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో పనులు చేసేందుకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అయినా అలాంటి వాటిని అధిగమించి అనుకున్న మేరకు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.– అప్పలనాయుడు, కల్లూరు ఎన్నెస్పీ ఈఈ -
నీటిలో ప్రాణం.. గాలిలో దీపం!
చీమకుర్తి: నాలుగు రోజుల క్రితం కేవీపాలెం వంతెన లాకులకు సమీపంలో ఉన్న డ్రాప్‌ల వద్ద సాగర్ కాలువలో ఈత కోసం దిగిన ఇద్దరు ఇంటర్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. త్రోవగుంట మేజర్ వద్ద గతంలో ఒంగోలుకు చెందిన ఇద్దరు స్నానానికి దిగి ప్రాణాలను నీటిలోనే వదిలేశారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం లాకుల వద్ద దుస్తులు ఉతుకుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటనల్లో ఏటా ఒంగోలు బ్రాంచ్ కెనాల్ (ఓబీసీ)లో సరాసరిన 10 మందికిపైగా మృత్యువాత పడుతుంటారని స్థానికుల అంచనా. రామతీర్థం రిజర్వాయర్ నుంచి టెయిల్ ఎండ్ ప్రాంతం వరకు దాదాపు 5–6 లాకులు ఉన్నాయి. 10కి పైగా డ్రాప్‌లు ఉన్నాయి. లాకుల వద్ద కంటే డ్రాప్‌ల వద్దే నీటి ప్రవాహ వేగం ఎక్కువుగా ఉంటుంది. డ్రాప్‌నకు దిగువన నీటి సుడులు సుడులుగా తిరుగుతూ ప్రమాదకరంగా ఉంటోంది. ఈత కోసం వచ్చే వారే ఎక్కువ రబీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసుకునే వారికి ఇరిగేషన్ అధికారులు సాధారణంగా జూలై నుంచి మరుసటి సంవత్సరం ఫిబ్రవరి లేక మార్చి వరకు సాగర్ నీరు విడుదల చేస్తుంటారు. చీమకుర్తికి సమీపంలో ఓబీసీ కాలువ అందుబాటులో ఉండటంతో కూనంనేనివారిపాలెం వెళ్లే దారిలో వంతెన వద్ద ఎక్కువ మంది విద్యార్థులు, ఇతర పెద్దలు స్నానాలకు దిగుతుంటారు. వారిలో సగం మందికిపైగా ఈత నేర్చుకుందామనుకుని వచ్చేవారే. ఈత బాగా వచ్చిన వారు కూడా కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైతే కొట్టుకుపోయి డ్రాప్లో పడ్డారంటే సుడి తిప్పినట్లు తిప్పేసి చివరకు శవాన్ని మరుసటి రోజుకు కిలోమీటరు దూరంలో కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏటా రామతీర్థం, ఎన్ఎస్పీ కాలనీ, గురుకుల పాఠశాల వెనుక, మువ్వవారిపాలెం డొంక సమీపం, కేవీ పాలెం వద్ద, చండ్రపాలెం, త్రోవగుంట మేజర్ వంటి పలు డేంజర్స్పాట్ల వద్దే ఎక్కువ మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఓబీసీ కట్టపైనే చీమకుర్తి బైపాస్ కూడా ఉండటంతో మనుషులే కాకుండా భారీ వాహనాలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు కూడా కాలువలోకి దూసుకొచ్చి చావుతుప్పి కన్నులొట్టబోయిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం సాగర్ నీరు ఓబీసీలో దాదాపు నాలుగైదు నెలల పాటు ప్రవహిస్తుంటాయి. ఏటా కాలువలోని డ్రాప్‌ల వద్ద పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రమాదాల గురించి జిల్లాస్థాయి, మండల స్థాయి ఇరిగేషన్ అధికారులు కొన్నేళ్లుగా వింటూనే ఉన్నారు. జాగ్రత్తలు మాత్రం ఇంతవరకు తీసుకోకపోవడం గమనార్హం. డేంజర్ స్పాట్ల వద్ద ఈతకు దిగితే కలిగే ప్రమాదం గురించి తెలియజేసే హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించవు. డ్రాప్‌ల వద్ద నీటి వేగం నుంచి ఈతకు దిగిన వారు బయట పడేందుకు ఆసరాగా ఉండే సిమెంట్ పిల్లర్లు, భీమ్‌లు లేక ఇతర ఆధారాలను కల్పించే ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమాయక ప్రజల ప్రాణాలు నీటిలో కలిసి పోకుండా ఉండాలంటే ఈతకు దిగే డేంజర్ స్పాట్లను ముందుగా గుర్తించాలని, వాటి వద్ద సరైన హెచ్చరికలు తెలియజేసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం ఓబీసీలో రామతీర్థం నుంచి టెయిల్ ఎండ్ వరకు 10 వరకు డ్రాప్‌లు ఉన్నాయి. వాటి వద్ద నీటి సుడులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈత వచ్చిన వారికి కూడా డ్రాప్‌ల వద్ద బయట పడాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి డేంజర్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా సైన్‌బోర్డులు లేక ఇతర ఏర్పాట్ల గురించి జిల్లా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటా.శ్రీనివాసరావు, ఈఈ, ఇరిగేషన్ -
చెరువులకు నీరు చేరేలా..
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో చెరువులు నింపడానికి నేరుగా తూములను ఏర్పాటు చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎడమకాల్వ పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయకపోయినా నీరు పుష్కలంగా లభ్యం కావడం వల్ల ఆయకట్టులో చెరువులు నిండేవి. కానీ ఇటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయంలోకి నీరు చేరడం లేదు. దాంతో ఎడమకాల్వకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి వచ్చినా కనీసం చెరువులు నింపడానికి నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. కాగా కాల్వ నుంచి నేరుగా చెరువులకు తూములు లేకపోవడం వల్ల మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేస్తే నీరు చెరువుకు చేరకుండా వృథాగా పోతోంది. దీంతో ఎన్ఎస్పీ అధికారులు కాల్వలకు నేరుగా తూములు ఏర్పాటు చేసి ఆయకట్టు పరిధిలోని చెరువులు నింపడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయకట్టులో ఉన్న మొత్తం చెరువులపై ఇటీవల సర్వే పూర్తిచేశారు. సర్వే ఆధారంగా ఎడమకాల్వకు నేరుగా తూములు ఏర్పాటు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టులో మొత్తం 417 చెరువులు.. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 173 గొలుసుల పరిధిలో 309 గొలుసుకట్టు చెరువులు, 108 ఒంటరి చెరువులు, మొత్తం 417 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటిపై ఎన్ఎస్పీ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా 309 గొలుసుకట్టు చెరువుల్లో 151 చెరువులకు మాత్రమే ప్రస్తుతం తూములు ఉన్నట్లు తేలింది. కాగా 22 చెరువులకు భూసేకరణ చే యాల్సి ఉందని, 20 చెరువులకు కాల్వలకు లేవని, 50 చెరువులు ఎన్ఎస్పీ ఆయకట్టు ప రిధిలో లేవని, 13 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలింది. కాగా మరో 53 చెరువులకు కొ త్తగా తూములు ఏర్పాటు చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. అదే విధంగా 108 ఒంటరి చెరువుల్లో 52 చెరువులకు కాల్వలతో పాటు పంట పొలాల మీదుగా వెళ్లే నీరు చేరుతుంది. ఒక చెరువుకు భూసేకరణ సమస్య, 16 చెరువులకు కాల్వలు తీసే పరిస్థితి లేదు. ఐదు చె రువులు ఆక్రమణకు గురయ్యాయని, 23 చెరువులు ఆయకట్టు పరిధిలో లేవనితే లింది. కాగా 11 ఒంటరి చెరువులకు తూముల ఏర్పాటుకు కసరత్తు సాగుతుంది. 64 చెరువులకు 45 కొత్త తూములు.. మొత్తం 417 చెరువుల్లో కొన్నింటికి తూములు ఉండడంతో పాటు ఇతర సమస్యల కార ణం ఉండగా ప్రస్తుతం 64 చెరువులకు 45 తూములను ఏర్పాటు చేసి ఈ వేసవిలో సా గర్ ఎడమకాల్వ నుంచి నేరుగా చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నారు. 35 గొలుసుల పరిధిలోని 53 గొలుసుకట్టు చెరువులకు, 11 ఒంటరి చెరువులకు తూములు ఏర్పాటు చేయనున్నారు. అందుకు గాను ఇటీవలనే ఎన్ఎస్పీ అధికారులు టెండర్లు సైతం పిలిచారు. కొత్తగా ఏర్పాటు చేసే తూముల్లో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 13, హుజూర్నగర్ నియోజకవర్గంలో 11, కోదాడ నియోజకవర్గంలో 17 తూములున్నాయి. వాటి పరిధిలో 64 చెరువులకు నీటిని అందించనున్నారు. నేరుగా నీరు చేరేలా చర్యలు సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో నేరుగా తూముల ద్వారా నీటిని నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆయకట్టు పరిధిలోని చెరువులను సర్వే నిర్వహించాం. నేరుగా తూములు లేని చెరువులను గుర్తించాం. అందుకు కొత్తగా 64 చెరువులకు 45 తూములు ఏర్పాటు చేసి నీటిని నింపుతాం. అందుకోసం టెండర్లు కూడా పిలిచాం. తూములు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులను నింపే అవకాశం ఉంటుంది. – నాగేశ్వర్రావు, ఈఈ, ఎన్ఎస్పీ మిర్యాలగూడ -
అంజలి శవమై బయటకు వచ్చింది!
ఒంగోలు, మార్టూరు: ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో గల్లంతైన అంజలి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు, ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీశారు. వలపర్ల గ్రామానికి చెందిన పల్లపు అంజలి (13) గురువారం ప్రమాదవశాత్తు సాగరు కాలువలో గల్లంతైన సంగతి తెలసిందే. ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు రామకూరు లాకుల వద్ద ఏర్పాటు చేసిన వల సమీపంలో అంజలి మృతదేహం లభ్యమైంది. అంజలి తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లి కూలీ నాలీ చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలను, భర్తను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో వలపర్ల బీసీ కాలనీలో చూపరులను కలచి వేసింది. చిలుకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి అంజలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. -
ఆ అన్నాతమ్ముడు చనిపోయారు
ఖమ్మంక్రైం : సాగర్ కాల్వలో గల్లంతైన ఆ అన్నాతమ్ముడు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గురువారం దొరికాయి. తమ బిడ్డలిద్దరూ విగతులుగా బయటకు వస్తున్న దృశ్యాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. 6వ తేదీన గల్లంతు... రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామానికి చెందిన నిరుపేదలైన బలంతు కృష్ణ–సీతమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం నగరంలోని వికలాంగుల కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు నాగరాజు(21), చంటి(18), కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ కూలీనాలీ పనులు చేస్తున్నారు. వీరిద్దరూ 6వ తేదీన పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చారు. బహిర్భూమికని, తమ ఇంటికి సమీపంలోగల సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. నీళ్లలోకి దిగుతున్నారు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో నీటిలో చంటి పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు నాగరాజు ప్రయత్నించాడు. అతడు కూడా నీటిలో పడిపోయాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కొందరు గమనించారు. కాపాడేందుకు ప్రయత్నించారు. ప్చ్.. వారి ప్రయత్నం విఫలమైంది. విస్తృతంగా గాలింపు తమ కొడుకులిద్దరూ గల్లంతయ్యారన్న వార్తతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. కుటుంబీకులు, బంధువులతో కలిసి కాల్వ వద్దకు వచ్చారు. అప్పటికే రాత్రవడంతో గాలింపు చేపట్టలేదు. మరుసటి రోజు (7వ తేదీన) ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా 50మంది గత ఈతగాళ్లు విస్తృతంగా గాలించారు. జాడ తెలియలేదు. ఆ తల్లిదండ్రుల్లో ఏదో చిన్న ఆశ.. ‘ఆ దేవుడు కరుణిస్తాడేమో... బతకనిస్తాడేమో..’ అని! తమ మనసులో ఆ ముక్కోటి దేవతలను వేడుకున్నారు.. ఆ ఇద్దరు బిడ్డలను క్షేమంగా తిరిగివ్వాలని..!! శవాలుగా తిరిగొచ్చారు.. ఆ తల్లిదండ్రుల వేదనను ఏ ఒక్క దేవుడుగానీ, దేవతగానీ ఆలకించలేదేమో..! ఆ ఇద్దరు బిడ్డలు ప్రాణాలొదిలారు. తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. టేకులపల్లి వద్ద నాగరాజు మృతదేహం దొరికింది. ఆ తరువాత పది నిమిషాలకే చంటి మృతదేహం కూడా అక్కడకు దగ్గరలోనే కనిపించింది. సామాజిక సేవకుడైన అన్నం శ్రీనివాస్‌రావు, తన బృందంతో కలిసి సాగర్ కాల్వ వద్దకు చేరుకున్నారు. ఆ ఇద్దరి మృతదేహాలను నగరంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను రఘునాథపాలెం మండలంలోని కోటపాడుకు తరలించారు. చెట్టంట కొడుకులు ఇద్దరినీ ఒకేసారి కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. -
దర్జాగా కబ్జా..
ఖమ్మం: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సాగర్ కాల్వలు వరంలా మారాయి. పంట పొలాలకు నీరందించే కాల్వలను కొల్లగొడుతూ.. పక్కనే తమ వెంచర్లలో యథేచ్ఛగా విలీనం చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. రైతులు మాత్రం తమ పంట భూములకు నీరందించే కాల్వలు బక్కచిక్కిపోవడం.. ఆక్రమణలకు గురికావడంతో ఆయకట్టుకు నీరందక అవస్థలు పడుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద మేజర్ కాల్వ నుంచి పెదతండా సాయిబాబా గుడి వరకు వచ్చే మూడో కాల్వ ప్రస్తుతం కనుమరుగైంది. సుమారు 20 అడుగుల వరకు ఉన్న మూడో కాల్వ పల్లెగూడెం నుంచి రెడ్డిపల్లి, తాళ్లేసేతండా, పెదతండా వరకు వందల ఎకరాలకు సాగునీరు అందించేది. రానురాను వ్యవసాయ భూములుగా వెంచర్లుగా మారుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు తాము కొనుగోలు చేసిన భూముల్లో కాల్వలను కూడా కలిపేసుకుంటున్నారు. ప్రస్తుతం మూడో కాల్వ అనేది నామరూపాలు లేకుండా పోయింది. దీని కింద కొద్దోగొప్పో భూమి ఉండి.. సాగు చేస్తున్న రైతుల భూములకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. రియల్టర్లు పెదతండా వద్ద తవుడు మిల్లు సమీపంలోని కాల్వలను తమ భూముల్లో కలుపుకుని వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం గమనార్హం. ఏదులాపురం చెరువు కాల్వ మాయం.. ఏదులాపురం నుంచి పెదతండా, గుర్రాలపాడు మొదటి భాగం భూముల వరకు వెళ్లే నీటి కాల్వ ఒకప్పుడు 20 అడుగులకుపైగా ఉండేది. ప్రస్తుతం 5 నుంచి 6 అడుగులకు చేరింది. దీనినిబట్టి కబ్జాదారులు ఎంతకు బరితెగించారో ఇట్టే అర్థమవుతోంది. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చిన కాల్వ రెండు వైపులా కలిపి 15 అడుగుల వరకు ఆక్రమణకు గురికావడం చూస్తే ఇక్కడే ఏడెనిమిది ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద ఓ రియల్టర్ ఏకంగా సాగర్ కాల్వ మధ్యలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. దర్జాగా పిల్లర్లు వేసి కొంత మేర గోడలు కూడా నిర్మించాడు. అప్పట్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా నడీ కాల్వపై ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై రైతులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తర్జన భర్జనల నడుమ తొలగించారు. అలాగే వరంగల్ క్రాస్‌రోడ్ నుంచి పెదతండా వరకు, పక్కనే ఎఫ్‌సీఐ గోడౌన్ల ఎదురుగా, ఆటోనగర్ ప్రాంతంలో కూడా కాల్వ ఆక్రమణకు గురైంది. 50 ఎకరాలు ఆక్రమణ దశాబ్ద కాలంగా ఆక్రమణదారులు పంట కాల్వలను ఆక్రమించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై రైతులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆక్రమణల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 20 అడుగుల కాల్వ ఉండేది.. పల్లెగూడెం నుంచి పెదతండా సాయిబాబా ఆలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర గతంలో 20 అడుగుల వెడల్పుతో పంట కాల్వ ఉండేది. అందులో వచ్చే నీటితో రెండు పంటలు పుష్కలంగా పండేవి. ప్రస్తుతం పంట భూములు ప్లాట్లుగా మారడంతో అసలు కాల్వే లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి భూములకు నీరందడం లేదు. – బాణోత్ తారాచంద్, పెదతండా సాగునీటికి ఇబ్బందులు.. గతంలో ఏదులాపురం చెరువు నుంచి వచ్చే పంట కాల్వ 20 అడుగుల వరకు ఉండేది. ఇప్పుడది అయిదారు అడుగులకు మించిలేదు. కాల్వ వెడల్పు ఉన్నప్పుడు పంటలకు నీరు సమృద్ధిగా చేరేవి. పంటలకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఉండేది. కాల్వ వెడల్పు తగ్గడంతో నీళ్లు రావడం తగ్గింది. ఆయకట్టు కొన్నేళ్లుగా ఎండిపోతోంది. – బాణోత్ సేవాలాల్, రైతు, పెదతండా ఆక్రమిస్తే సహించేది లేదు.. ఎక్కడైనా పంట కాల్వలు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వరంగల్ క్రాస్‌రోడ్ ప్రాంతంలో సాగర్ పంట కాల్వపై రియల్టర్ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాం. పంట కాల్వలు ఆక్రమిస్తే తమకు వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. – బి.నర్సింహారావు, తహసీల్దార్ -
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ
ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్ నుంచి విశాఖపట్నానికి ప్లాస్ట్ర్ ఆఫ్ పారీస్ లోడుతో వస్తున్న లారీ అతివేగం మూలంగా అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు. -
సాగర్ కాల్వకు నీటి సరఫరా నిలిపివేత
గుంటూరు: నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి సరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. ఏపీకి 15.2 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. అయితే 13.2 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ విడుదల చేసిందని ఆంధ్ర అధికారులు అంటున్నారు. మిగతా 2 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, నీరు నిలిపివేతపై రైతులు ఆందోళ చేస్తున్నారు. -
సాగర్ కాలువలో తగ్గిన నీటిమట్టం
మేజర్లకు ఎక్కక రైతుల ఇబ్బందులు ఎస్కేప్ నుంచి యథేచ్ఛగా తరలుతున్న నీరు కురిచేడు : ఆరుతడి సాగుకు నాగార్జున సాగర్ కాలువ ద్వారా వారం నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవటంతో మేజర్లకు నీరు ఎక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు నీరు వచ్చి కూడా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్పీ ఎస్ఈ శారద ఆదివారం కాలువపై పర్యటించారు. దిగువ ఉన్న మేజర్లకు నీరు సరఫరా చేసేందుకు ఎగువున ఉన్న మేజర్లను నిలిపేయాలని సూచించారు. మరో వారం, పది రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతున్నందున రైతులకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. దిగువ ప్రాంత రైతుల పరిస్థితిని కూడా ఎగువ ప్రాంత రైతులు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు. ఎస్ఈతో పాటు దర్శి డీఈఈలు కరిముల్లా, శ్రీనివాసరావు ఉన్నారు. చెరువులకూ చేరని వైనం... స్థానిక అట్లపల్లి చెరువుకు నేటి వరకూ చుక్క నీరు కూడా మళ్లించలేదు. అట్లపల్లి చెరువు పక్క చెరువులో లోతు తవ్వటంతో నీరు సీఫేజ్ అవుతోంది. అలా చెరువు ఖాళీ అయినా అధికారులు ఆ లీకును నిలువరించలేదు సరికదా తిరిగి నీటితో నింపలేదు. దీంతో తాగునీటి కష్టాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వస్తున్న నీటితో తాగునీటి చెరువును నింపాల్సిన అవసరం ఉంది. సగం కూడా రాని నీరు త్రిపురాంతకం: నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 1440 క్యూసెక్కులు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. బుగ్గవాగు నుంచి 6500 క్యూసెక్కులు నీరు పెంచి విడుదల చేస్తున్నారు. తక్కువ నీటి సరఫరా జరుగుతుండడంతో మేజర్లకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విడుదల చేసినపుడు 2650 క్యూసెక్కులు రాగా రెండో రోజు నుంచి పూర్తిగా నీటి సరఫరా తగ్గిపోతు వచ్చింది. జిల్లా ప్రధాన కాలువకు 3350 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. సగం నీరు కూడా అందడం లేదు. గుంటూరు జిల్లా అక్రమ చౌర్యమే కారణం ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని పంటలను రక్షించేందుకు ఆరుతడులకు నీరు విడుదల చేసారు. ఒక్కో జిల్లాకు ఐదు టీఎంసీలు మొత్తం పది టీఎంసీల నీటిని అందిస్తున్నారు. ఇప్పిటికి వారం రోజులకు గాను ఒక టీఎంసీ నీరు మాత్రమే అందినట్లు అధికారుల లెక్కలు మరో పది రోజులు మాత్రమే నీరు అందనుంది. మిగిలిన నాలుగు టీఎంసీల నీరు ఎప్పుడు అందిస్తారు. వచ్చిన నీటిని అక్రమంగా, మేజర్ల ద్వారా సామర్థ్యాన్ని మించి ఎస్కేప్ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకు పోతుండడంతో జిల్లాకు నీరందడం లేదు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై వత్తిడి తెచ్చి యథేచ్ఛగా తరలిస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు లేకపోవడం దారుణమైన విషయం. ఇలానే కొనసాగితే వేసిన పంటలు నిలువునా ఎండిపోవాల్సిందే నని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో ప్రస్తుత నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి కాలువ పేరు నీటి సరఫరా (క్యూసెక్కుల్లో) ఒకటో తేదీ ఆరో తేదీ నాగార్జున సాగర్‌డ్యాం 4,000 7,200 బుగ్గవాగు వద్ద 5,627 6,562 గుంటూరు బ్రాంచికి 1,300 1,300 అద్దంకి బ్రాంచికి 1,200 1,088 57/2 మైలు వద్ద 2,000 2,291 జిల్ల సరిహద్దు85/3 వద్ద 1,632 1,440 126 వ మైలుకురిచేడు వద్ద 1,192 947 ఒంగోలు బ్రాంచికి 883 505 -
పండుగకు వచ్చి పరలోకాలకు
సాగర్ కాల్వలో పడి నలుగురి మృత్యువాత కోదాడ: ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల్లో కృష్ణా జిల్లా వత్సవాయి మండ లం దేశపాలెంకి చెందిన ఫకీరాబీ, చిన సైదులు దంపతుల సంతానం షేక్ సుద్దాబీ(18), హుస్సేనాబేగం (14), ముస్తఫా (10)తోపాటు, ఖమ్మం జిల్లాకు చెందిన సైదాబీ, షేక్ మహబూబ్ హుస్సేన్‌ల కుమారుడు రియూజ్(9) ఉన్నారు. వీరంతా 4 రోజుల క్రితం పీర్ల పండుగకు అమ్మమ్మ మీరాబీ నివాసం ఉంటున్న నడిగూడెం మండలం సిరి పురానికి వచ్చారు. బుధవారం బట్టలు ఉతికేం దుకు సైదాబీతోపాటు నలుగురు వెళ్లారు. హుస్సేనాబేగం తమ్ముళ్లు ముస్తఫా, రియూజ్ లకు కాల్వ దరి వెంట స్నానం చేయిస్తుండగా, అత్త సైదాబీ, సుద్దాబీ బట్టలు ఉతుకుతున్నారు. ఈ క్రమంలో హుస్సేనాబేగం ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడడంతో ముస్తఫా, రియూజ్‌లు ఆమెను రక్షించేందుకు నీటిలోకి వెళ్లారు. ఈత రాక ముగ్గురూ కేకలు వేస్తుండగా.. పక్కనే బట్టలు ఉతుకుతున్న సుద్దాబీ వారిని రక్షించేం దుకు నీటిలోకి దూ కింది. అయితే వారంతా సుద్దాబీని గట్టిగా పట్టుకోవడంతో ఆమెతో పాటు అందరూ నీటిలో మునిగిపోయూరు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి కాల్వలోకి దిగి నలుగురిని బయటికి తీయగా అప్పటికే వారంతా చనిపోయూరు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా, సుద్దాబీకి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. -
సాగర్ కాలువలో యువకుడి గల్లంతు
= క్షేమంగా బయటపడిన నలుగురు యువకులు = చీమకుర్తి సమీపంలోని చీమలమర్రి సాగర్ కాలువలో ఘటన .. = గుంటూరుకు కారులో వెళ్తూ మార్గమధ్యంలో ఈతకు దిగిన వైనం = గల్లంతైన యువకుని కోసం సాగర్ పొడవునా గాలిస్తున్న గజ ఈతగాళ్లు = అందరూ అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులే సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఐదుగురు యువకుల్లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని సాగర్ కాలువలో గల్లంతయ్యాడు. తాడిపత్రికి చెందిన పోసా అరుణ్, పూల సురేశ్, గుత్తా రాకేశ్,కావేటి రామాంజనేయులు, నందికం హరి కలసి ఓ కారులో గుంటూరు బయల్దేరారు. శనివారం ఉదయం మార్గమధ్యంలోని చీమలమర్రి వద్ద గల సాగర్ కాలువ వద్దకు రాగానే కారు ఆపారు. ఈత కోసం కాలువలోకి దిగారు. కొద్ది సేపటి తర్వాత నందికం హరి(19) కాలువలో గల్లంతై డ్రాప్లో పyì పోయాడు. కాపాడేందుకు అతని సొంత బావ కావేటి రామాంజనేయులు కూడా అందులోకి దూకారు. బామ్మర్ది కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. పైగా అతడు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వెంటనే ఓ బెల్ట్ సాయంతో రామాంజనేయులును అతికష్టమ్మీద బయటకు తీశారు. హృదయ విదారకం డ్రాపులో హరి కొద్దిసేపు కొట్టుమిట్టాడుతుండటాన్ని తోటి స్నేహితులు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈత రాక రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరినీ కాపాడాలంటూ వేడుకున్నారు. అయితే డ్రాప్‌లోకి దిగేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. బామ్మర్ది గల్లంతుపై బావ రామాంజనేయులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు తన భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ కుమిలిపోయారు. చీమలమర్రి డ్రాప్‌ల వద్ద గాలింపు చీమలమర్రి డ్రాప్‌ల నుంచి హరి దిగువకు కొట్టుకెళ్లినట్లు తెలుసుకున్న సీఐ మురళి, సంతనూతలపాడు ఎస్ఐ హుస్సేన్‌బాషా తమ సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. రామతీర్థం జలాశయం వద్ద నీటి వేగాన్ని తగ్గించారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం ఎన్ఎస్పీ కెనాల్ వద్ద గజ ఈతగాళ్లు హరి ఆచూకీ కోసం గాలించారు. రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా అతని ఆచూకీ దొరకలేదని సీఐ తెలిపారు. ఈతముక్కల మేజర్ వరకు వెతికిస్తున్నట్లు వివరించారు. -
సాగర్ కాల్వకు గండ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అద్దంకి బ్రాంచి కెనాల్‌కు శుక్రవారం గండ్లు పడ్డాయి. వల్లేపల్లి లాకుల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గండ్లు పడ్డాయి. దీంతో భారీగా నీరు పంట పొలాల్లోకి ప్రవేశించింది. దాంతో షట్టర్లను అధికారులు కిందికి దింపారు. నీరు ముందుకు వెళ్లకుండా కంప చెట్లను అడ్డుగా ఉంచటంతోనే కెనాల్‌కు గండ్లు పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఖమ్మం క్రైం : నగరంలోని వేణుగోపాల్‌నగర్ సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల క«థనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన అల్లాడి రాజారమేష్(25) రోడ్ల మర్మతుల పనులకు ఖమ్మం వచ్చాడు. మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. వెంటనే అతడి సోదరుడు, స్నేహితులు ఎంత వెతికినా రాజారమేష్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో టూటౌన్ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం రాజారమేష్ గల్లంతయిన ప్రాంతానికి కొద్దిదూరంలో అతడి మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు. -
ఆదమరిస్తే ఆగమే
♦ సాగర్ కాల్వల వెంట పొంచి ఉన్న ప్రమాదం ♦ సాగర్ కాల్వల వెంట పొంచి ఉన్న ప్రమాదం ♦ రెయిలింగ్ లేని పరిస్థితి రాత్రివేళల్లోనే ప్రమాదాలు ♦ పట్టించుకోని అధికారులు కూసుమంచి : సాగర్ కాల్వల వెంట ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. ఖమ్మం-సూర్యాపేట రాష్ట్రీయ రహదారిపై నాయకన్‌గూడెం, పాలేరు గ్రామాల మధ్య నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా రోడ్డు వెంట ఉన్న కాల్వల్లోకి దూసుకెళ్లాల్సిందే. శుక్రవారం నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాలువ ప్రాంతంలో రహదారి ప్రమాదంగా మారటం తో ఆర్టీసీ బస్సు కాలువలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఎం.రాంబాబు (మహబూబ్‌నగర్),నర్సింహ(ఇనుగుర్తి), చిన్న కిష్టప్ప(మహబూబ్‌నగర్), చిన్నప్ప(మహబూ బ్‌నగర్), కృష్ణారెడ్డి(జడ్చర్ల), చలక ఉపేంద ర్(మధిర),విష్ణువర్థన్(కొత్తగూడెం), నరసింహ (హైదరాబాద్), నున్నా నవీన్ (పల్లిపాడు), కె.నిరీక్షణ్రావు(దమ్మపేట), అల్లం ప్రవీణ్ (పాల్వంచ), కృష్ణకుమారి(పాల్వంచ), కౌసల్య (పాల్వంచ), ముస్తఫా(హైదరాబాద్), వెంకటే శ్వర్లు(పాల్వంచ), చిట్టిబాబు(బస్సు డ్రైవర్), కొమ్ము శైలజ(వైరా, మృతిచెందిన బాలుడి తల్లి) ఉన్నారు. నాయకన్‌గూడెం వద్ద హడల్.. నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాలువ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. కాలువ వద్ద మూలమలుపు ఉండటం.. అక్కడ వంతెన ఇరుకుగా ఉండటంతో వచ్చే వాహనాలను గుర్తించటం కష్టమవుతోంది. కాలువకు రెగ్యులేటరీ గేట్లు ఉండటంతో రిజర్వాయర్‌కు నీటిని వదులుతుంటారు. భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలేరు.. ప్రమాదకరం.. పాలేరురిజర్వాయర్ అవుట్ ఫాల్కాలువ, మినీ హైడల్‌కు నీరందించే కాలువల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువను తవ్వగా.. కాలువపై వంతెన నుంచే రాష్ట్రీయ రహదారి వెళ్తుంది. ఈ క్రమంలో కాలువ గేట్లవద్ద రోడ్డుకు అవతలి వైపు.. కాలువ ప్రారంభంలో రక్షణ గోడలు లేవు. రిజర్వాయర్‌ను, కాలువలను చూసేందు కు వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతంలో ప్రమాదకరమే. దీంతోపాటు రిజర్వాయర్ నుంచి మినీ హైడల్ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే కాలువకు ఉన్న వంతెన రెయిలింగ్ కూడా విరగటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 2014 లో డీసీఎం కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కొందరు వాహనదారులు కాలువలో పడిపోయారు. రాత్రి వేళల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
సాగర్ కాల్వలో గుర్తు తెలియని మృతదేహాలు
బొల్లాపల్లి: గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం కురువ వద్ద ఎన్ఎస్పీ ప్రధాన కాల్వలో రెండు మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గోనెసంచిలో మూటకట్టి ఉన్న పురుషుల మృతదేహాలు రెండింటిని మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.పూర్తిగా కుళ్లిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నమృతదేహాలకు అక్కడే శవపరీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. -
సాగర్ కెనాల్లో పడి యువకుడి మృతి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మునగాలలో విషాదం
మునగాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానం చేసేందుకు నాగార్జున సాగర్ కాలువలోకి దిగిన ఇద్దరు నీటమునిగి మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునగాలలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చనిపోయిన ఇద్దరూ సూర్యాపేట వాసులుగా గుర్తించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మేకరాజు ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రశాంత్‌కు వారం కిందటే వివాహం అయింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రశాంత్ కుటుంబసభ్యులు దాదాపు 11 మంది బుధవారం ఉదయం మునగాలకు చేరుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో స్నానాలు చేసి, సమీపంలోని అయ్యప్ప ఆలయంలో పూజలు చేయాలని భావించారు. స్నానాలు చేసేందుకు సాగర్ కాలువలోకి దిగిన ప్రశాంత్, అతని మేనమామ కనపర్తి మహేష్(50) నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయారు. కేకలు వేయటంతో అక్కడే స్నానాలు చేస్తున్న అయ్యప్ప మాలధారులు వారిని రక్షించేందుకు యత్నించారు. కొద్దిసేపటికి ప్రశాంత్‌ను ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. మహేష్ జాడ దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. -
‘పేట’కు మురుగునీరేనా?
సూర్యాపేట : పేటవాసులకు తాగునీటి కష్టాలు తప్పేలాలేవు. ప్రతి ఏడాది వేసవిలో ఉండే ఇబ్బందులు ఈ సారి మాత్రం ముందే మొదలయాయ్యి. నీటి శుద్ధికోసం ఏటా రూ. 30లక్షలు చేస్తున్నట్లు మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం అధికారుల లెక్కలు చూపుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. మూసీలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరడం.. నిత్యం చేపలవేట కొనసాగించడంతో నీరంతా మురికిగా మారుతోంది. ఈ నీటిలో దుర్వాసన వస్తోంది. దీనిని తాగడం మాట అటుంచితే కనీసం ఇతరఅవసరాలకు కూడా వినియోగించే పరిస్థితిలేదు. ప్రజలకు పరిశుద్ధమైన జలాలు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతిని ధులు ఎన్నికల సమయంలో చేస్తున్న హామీలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. దీంతో పేట వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. పట్టణంలో 1.05 లక్షల జనాభా ఉన్నట్లు అధికారికలెక్కలు చూపుతున్నాయి. అదనంగా మరో 50 వేల మంది వ్యాపార, వాణిజ్యాల కోసం వస్తున్నారు. పట్టణంలోని 17 వార్డులకు మూసీ నీరు, 17 వార్డులకు సాగర్ జలాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి 165 లీటర్ల నీరు అవసరం కాగా వీరందరికీ ప్రతిరోజూ 23 ఎమ్ఎల్డీల నీరు అవసరం ఉంటుంది. కానీ మూసీ నుంచి 13.13 ఎమ్‌ఎల్‌డీలు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 09.01 ఎమ్‌ఎల్‌డీలు, సాగర్ కెనాల్ నుంచి 10.15 సరఫరా కావాల్సి ఉండగా కేవలం 05.41 ఎమ్ఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా మూడు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఈయేడు వర్షాలు సరిగా కురవకపోవడంతో ఎగువప్రాంతం నుంచి నీరు మూసీ రిజర్వాయర్‌లోకి ఎక్కువగా చేరలేదు. మూసీలో గరిష్ట నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 607అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఇటీవల ఎంతోకాలం నుంచి మరమ్మతులకు నోచుకోని షటర్లను మరమ్మతు చేసేందుకు నీటిని విడుదల చేశారు. నవంబర్ నుంచి జూన్ 15 వరకు షటర్ల మరమ్మతులు పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 610 అడుగుల మేరకు నీటిస్థాయి తగ్గితేనే షటర్లు మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్నందు వల్ల అప్పటి దాకా నీటిని విడుదల చేశారు. డెడ్ స్టోరేజీ అంటే 605 అడుగులు మాత్రమే. 605 అడుగులకు నీటి మట్టం చేరితే దుర్గంధంతో కంపు కొట్టే నీరు మాత్రమే సరఫరా అవుతోంది. 590 అడుగుల దాకా పేట వాసులకు నీటి సరఫరా చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం దుర్వాసనతో కూడిన నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కనీసం అవి నిత్యవసరాలకు వినియోగించే పరిస్థితి లేదని వాపోతున్నారు. మరో నాలుగు నెలలకు పైగా గడిస్తేగానీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేట ప్రజలు తెలిపారు. ఇప్పటికే మూడురోజులకోసారి సరఫరా చేసే నీటిని వారం రోజులకు కూడా పెంచే అవకాశమున్నట్లు ఆందోళన చెందుతున్నారు. లక్షలు వ్యయం.. ఫలితం శూన్యం మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం నీటిశుద్ధి చేసేందుకు గాను ఏటా ఆళం కోసం రూ. 10లక్షలు, క్లోరిన్ గ్యాస్ కోసం రూ. 20లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. కానీ ఎలాంటి ప్రయోజం చేకూరడంలేదు. పట్టణ ప్రజలకు మాత్రం మురుగునీరే సరఫరా చేస్తున్నారు. సాగర్ కెనాల్ ద్వారా.. ఇక సాగర్ కెనాల్ ద్వారా ఏటా మార్చి 15 వరకు నీరు విడుదల చేస్తుండడంతో ఆ నీటిని పట్టణానికి సరఫరా చేస్తారు. సాగర్ కెనాల్ బంద్అయిన అనంతరం అనాజిపురం గాండ్ల చెరువును నింపుతారు. ఆ రిజర్వాయర్ నుంచి 45 రోజులు పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. అంటే మే చివరి నాటికి కృష్ణా జలాలు 15 వార్డులకు సరఫరా అవుతాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడితేనే దోసపహాడ్ నుంచి పట్టణానికి నీటి సరఫరా అవుతుంది. లేకపోతే పట్టణానికి నీటి సరఫరా బంద్. మూసీ రిజర్వాయర్ నింపేందుకు ప్రత్యామ్నాయం లేదా? కాగా వర్షాలు సరిగా కురవకపోవడం.. షటర్ల మరమ్మతుల పేరిట నెల,రెండు నెలల పాటు నీరు విడుదల చేయడంతో డెడ్ స్టోరేజీకి చేరుకోనున్న మూసీ రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవనే అధికారులు చెబుతున్నారు. కేవలం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్ నిండే అవకాశాలు లేవు. సాగర్ కెనాల్ నుంచే రప్పించేందుకు ఏర్పాట్లు.. స్థానిక ఎమ్మెల్యే, రాష్ర్ట మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చొరవ తీసుకొని పేట వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సాగర్ కెనాల్‌ను మార్చి 15 తర్వాత కూడా బంద్ చేయకుండా పట్టణానికి నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే అనాజిపురం గాండ్ల చెరువు రిజర్వాయర్ నిండి ఉండడంతో పాటు కెనాల్ కూడా వేసవిలో బంద్ కాకుండా వస్తే పట్టణ ప్రజలకు నీటినందింవచ్చని భావిస్తున్నారు. మూసీ నుంచి బంద్ అయితే పట్టణమంతా దోసపహాడ్ నీటి సరఫరా.. మూసీ నుంచి వచ్చే నీరు మరోనెల రోజుల పాటు సరిపోతుందని, ఆ తర్వాత ఇప్పటికే 17 వార్డులకు సరఫరా చేస్తున్న దోసపహాడ్ నీటిని పట్టణానికంతటికీ సరఫరా చేసేందుకు ఇప్పటికే పొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సాగర్ కెనాల్ నుంచి నిరవధికంగా వేసవి అంతా నీరు విడుదలైతేనే పేట వాసులకు నీటి గండం తప్పేట్లు లేదు. మరమ్మతులకు నోచని చేతిపంపులు... పట్టణంలో సుమారు 479చేతిపంపులు ఉండగా సగానికిపైగా నిర్వహణలోపంతో పనిచేయడం లేదు. అధికారులు తాగునీటి సమస్యనుంచి గట్టెక్కించేందుకు వాటిని రిపేర్ చేయించేదిపోయి ఫ్లోరిన్ ఎక్కువగా ఉందనే సాకుతో వాటిని వదిలేశారు. వాటి మరమ్మతుల కోసం వచ్చిన డబ్బులు మాత్రం అధికారుల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలున్నాయి. ముక్కుపిండి నల్లాబిల్లుల వసూలు నీటి సరఫరాలో శ్రద్ధచూపని అధికార యంత్రాంగం నల్లాబిల్లులు మాత్రం ముక్కుపండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో అధికారికంగా 14వేల నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల రూ. 200 ఓ కనెక్షన్ ఇవ్వడంతో అదనంగా మరో 500 కనెక్షన్లు పెరిగాయి. అయినప్పటికీ అధికారులు నీటి సరఫరాలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పట్టణంలోని 7వేల కనెక్షన్ నంబర్ల వరకు బీపీఎల్ వినియోగదారులకు ప్రతి కనెక్షన్‌కు రూ. 80చొప్పున నల్లాబిల్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా నిర్మించిన గృహ యజమానుల నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో సుమారు 3వేల మంది వద్ద నుంచి రూ. 80చొప్పున నల్లాబిల్లు తీసుకుంటున్నారు. మూసీలో చేపల వేట.. మూసీ ప్రాజెక్టులో కొంతకాలంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో మూసీలో తక్కువ నీరు ఉండడం.. మత్స్యకారులు వలలతో చేపలు పడుతుండడంతో నీరు బురదమయంగా మారింది. అదే నీరు సూర్యాపేట పట్టణానికి సరఫరా అవుతోంది. దీంతో బురదనీటితోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం - వెంకటేశ్వరరావు, మున్సిపల్ డీఈ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. మూసీ గేట్ల మరమ్మతు కోసం నీటిని విడుదల చేశారు. ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. రెండు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. -
సాగర్ కాల్వలో శవం లభ్యం
ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి మండలం సాగర్ కాల్వలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి షర్ట్ జేబులో డ్రైవింగ్ లెసైన్స్, ఐడీ కార్డులు లభించాయి. వాటి ఆధారంగా మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.