సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ | lorry plunges into sagar canal in khammam district | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ

Published Sat, Apr 8 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ

సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ

ఖమ్మం: జిల్లాలోని కొణిజెర్ల సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లింది.

శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌ నుంచి విశాఖపట్నానికి ప్లాస్ట్‌ర్‌ ఆఫ్‌ పారీస్‌ లోడుతో వస్తున్న లారీ అతివేగం మూలంగా అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement