సాగర్‌ కాలువలో తగ్గిన నీటిమట్టం | decrease water levels in sagar | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో తగ్గిన నీటిమట్టం

Published Sun, Nov 6 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

సాగర్‌ కాలువలో తగ్గిన నీటిమట్టం

సాగర్‌ కాలువలో తగ్గిన నీటిమట్టం

  • మేజర్లకు ఎక్కక రైతుల ఇబ్బందులు
  • ఎస్కేప్‌ నుంచి యథేచ్ఛగా తరలుతున్న నీరు
  • కురిచేడు : 
    ఆరుతడి సాగుకు నాగార్జున సాగర్‌ కాలువ ద్వారా వారం నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవటంతో మేజర్లకు నీరు ఎక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు నీరు వచ్చి కూడా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ శారద ఆదివారం కాలువపై పర్యటించారు.
     
    దిగువ ఉన్న మేజర్లకు నీరు సరఫరా చేసేందుకు ఎగువున ఉన్న మేజర్లను నిలిపేయాలని సూచించారు. మరో వారం, పది రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతున్నందున రైతులకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. దిగువ ప్రాంత రైతుల పరిస్థితిని కూడా ఎగువ ప్రాంత రైతులు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు. ఎస్‌ఈతో పాటు దర్శి డీఈఈలు కరిముల్లా, శ్రీనివాసరావు ఉన్నారు. 
     
    చెరువులకూ చేరని వైనం...
    స్థానిక అట్లపల్లి చెరువుకు నేటి వరకూ చుక్క నీరు కూడా మళ్లించలేదు. అట్లపల్లి చెరువు పక్క చెరువులో లోతు తవ్వటంతో నీరు సీఫేజ్‌ అవుతోంది. అలా చెరువు ఖాళీ అయినా అధికారులు ఆ లీకును నిలువరించలేదు సరికదా తిరిగి నీటితో నింపలేదు. దీంతో తాగునీటి కష్టాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వస్తున్న నీటితో తాగునీటి చెరువును నింపాల్సిన అవసరం ఉంది.
     
    సగం కూడా రాని నీరు
    త్రిపురాంతకం: నాగార్జున సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 1440 క్యూసెక్కులు మాత్రమే  నీరు సరఫరా అవుతోంది. బుగ్గవాగు నుంచి 6500 క్యూసెక్కులు నీరు పెంచి విడుదల చేస్తున్నారు. తక్కువ నీటి సరఫరా జరుగుతుండడంతో మేజర్లకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విడుదల చేసినపుడు 2650 క్యూసెక్కులు రాగా రెండో రోజు నుంచి పూర్తిగా నీటి సరఫరా తగ్గిపోతు వచ్చింది. జిల్లా ప్రధాన కాలువకు 3350 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. సగం నీరు కూడా అందడం లేదు.  
     
    గుంటూరు జిల్లా అక్రమ చౌర్యమే కారణం
    ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని పంటలను రక్షించేందుకు ఆరుతడులకు నీరు విడుదల చేసారు. ఒక్కో జిల్లాకు ఐదు టీఎంసీలు మొత్తం పది టీఎంసీల నీటిని అందిస్తున్నారు. ఇప్పిటికి వారం రోజులకు గాను ఒక టీఎంసీ నీరు మాత్రమే అందినట్లు అధికారుల లెక్కలు మరో పది రోజులు మాత్రమే నీరు అందనుంది. మిగిలిన నాలుగు టీఎంసీల నీరు ఎప్పుడు అందిస్తారు.
     
    వచ్చిన నీటిని అక్రమంగా, మేజర్ల ద్వారా సామర్థ్యాన్ని మించి ఎస్కేప్‌ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకు పోతుండడంతో జిల్లాకు నీరందడం లేదు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై వత్తిడి తెచ్చి యథేచ్ఛగా తరలిస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు లేకపోవడం దారుణమైన విషయం. ఇలానే కొనసాగితే వేసిన పంటలు నిలువునా ఎండిపోవాల్సిందే నని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
    కాలువలో ప్రస్తుత నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి
    కాలువ పేరు నీటి సరఫరా (క్యూసెక్కుల్లో)
    ఒకటో తేదీ ఆరో తేదీ
    నాగార్జున సాగర్‌డ్యాం 4,000 7,200
    బుగ్గవాగు వద్ద 5,627 6,562
    గుంటూరు బ్రాంచికి 1,300 1,300
    అద్దంకి బ్రాంచికి 1,200 1,088
    57/2 మైలు వద్ద 2,000 2,291
    జిల్ల సరిహద్దు85/3 వద్ద 1,632 1,440
    126 వ మైలుకురిచేడు వద్ద 1,192 947
    ఒంగోలు బ్రాంచికి 883 505 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement