సాగర్ ఎడమకాల్య
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో చెరువులు నింపడానికి నేరుగా తూములను ఏర్పాటు చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎడమకాల్వ పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయకపోయినా నీరు పుష్కలంగా లభ్యం కావడం వల్ల ఆయకట్టులో చెరువులు నిండేవి. కానీ ఇటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయంలోకి నీరు చేరడం లేదు. దాంతో ఎడమకాల్వకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి వచ్చినా కనీసం చెరువులు నింపడానికి నీటిని విడుదల చేయాల్సి వస్తోంది.
కాగా కాల్వ నుంచి నేరుగా చెరువులకు తూములు లేకపోవడం వల్ల మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేస్తే నీరు చెరువుకు చేరకుండా వృథాగా పోతోంది. దీంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు కాల్వలకు నేరుగా తూములు ఏర్పాటు చేసి ఆయకట్టు పరిధిలోని చెరువులు నింపడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయకట్టులో ఉన్న మొత్తం చెరువులపై ఇటీవల సర్వే పూర్తిచేశారు. సర్వే ఆధారంగా ఎడమకాల్వకు నేరుగా తూములు ఏర్పాటు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఆయకట్టులో మొత్తం 417 చెరువులు..
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 173 గొలుసుల పరిధిలో 309 గొలుసుకట్టు చెరువులు, 108 ఒంటరి చెరువులు, మొత్తం 417 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటిపై ఎన్‌ఎస్‌పీ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా 309 గొలుసుకట్టు చెరువుల్లో 151 చెరువులకు మాత్రమే ప్రస్తుతం తూములు ఉన్నట్లు తేలింది. కాగా 22 చెరువులకు భూసేకరణ చే యాల్సి ఉందని, 20 చెరువులకు కాల్వలకు లేవని, 50 చెరువులు ఎన్‌ఎస్‌పీ ఆయకట్టు ప రిధిలో లేవని, 13 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలింది. కాగా మరో 53 చెరువులకు కొ త్తగా తూములు ఏర్పాటు చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. అదే విధంగా 108 ఒంటరి చెరువుల్లో 52 చెరువులకు కాల్వలతో పాటు పంట పొలాల మీదుగా వెళ్లే నీరు చేరుతుంది. ఒక చెరువుకు భూసేకరణ సమస్య, 16 చెరువులకు కాల్వలు తీసే పరిస్థితి లేదు. ఐదు చె రువులు ఆక్రమణకు గురయ్యాయని, 23 చెరువులు ఆయకట్టు పరిధిలో లేవనితే లింది. కాగా 11 ఒంటరి చెరువులకు తూముల ఏర్పాటుకు కసరత్తు సాగుతుంది.
64 చెరువులకు 45 కొత్త తూములు..
మొత్తం 417 చెరువుల్లో కొన్నింటికి తూములు ఉండడంతో పాటు ఇతర సమస్యల కార ణం ఉండగా ప్రస్తుతం 64 చెరువులకు 45 తూములను ఏర్పాటు చేసి ఈ వేసవిలో సా గర్ ఎడమకాల్వ నుంచి నేరుగా చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నారు. 35 గొలుసుల పరిధిలోని 53 గొలుసుకట్టు చెరువులకు, 11 ఒంటరి చెరువులకు తూములు ఏర్పాటు చేయనున్నారు. అందుకు గాను ఇటీవలనే ఎన్‌ఎస్‌పీ అధికారులు టెండర్లు సైతం పిలిచారు. కొత్తగా ఏర్పాటు చేసే తూముల్లో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 13, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 11, కోదాడ నియోజకవర్గంలో 17 తూములున్నాయి. వాటి పరిధిలో 64 చెరువులకు నీటిని అందించనున్నారు.
నేరుగా నీరు చేరేలా చర్యలు
సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో నేరుగా తూముల ద్వారా నీటిని నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆయకట్టు పరిధిలోని చెరువులను సర్వే నిర్వహించాం. నేరుగా తూములు లేని చెరువులను గుర్తించాం. అందుకు కొత్తగా 64 చెరువులకు 45 తూములు ఏర్పాటు చేసి నీటిని నింపుతాం. అందుకోసం టెండర్లు కూడా పిలిచాం. తూములు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులను నింపే అవకాశం ఉంటుంది. – నాగేశ్వర్‌రావు, ఈఈ, ఎన్‌ఎస్‌పీ మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment