బీసీలకు ప్రత్యేక శాఖ అవసరం: కృష్ణయ్య | The need for a separate Department of BCs: Krishnaiah | Sakshi
Sakshi News home page

బీసీలకు ప్రత్యేక శాఖ అవసరం: కృష్ణయ్య

Published Tue, Jul 22 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

బీసీలకు ప్రత్యేక శాఖ అవసరం: కృష్ణయ్య

బీసీలకు ప్రత్యేక శాఖ అవసరం: కృష్ణయ్య

న్యూఢిల్లీ : రాజ్యాంగ రచనలోనే బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల సంక్షేమం కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న డిమాండ్‌పై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 

పార్లమెంటువైపు ర్యాలీ గా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నానుద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అవడం బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సిన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటాను ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement