ప్రజలందరికీ శుభాలు కలగాలి
గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: ప్రజలందరికీ శుభాలు, సుఖసంతోషాలు అందించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. శ్రావణ మాసంలో టీటీడీ ఏటా బాలాజీభవన్‌లో మహిళలతో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ సంప్రదాయంలో భాగంగా శుక్రవారం హిమాయత్‌నగర్ లిబర్టీ బాలాజీభవన్ తిరునిల యంలో జరిగిన వరలక్ష్మీ వ్రతం దేవీ కుంకుమార్చన కార్యక్రమాన్ని గవర్నర్ తన సతీమణి విమలా నరసింహన్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం గవర్నర్ సతీమణి మహిళలతో కలిసి కుంకుమార్చన నిర్వహించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ దగ్గరుండి వీక్షించారు.
ఈ సందర్భంగా గవర్నర్ కుంకుమార్చన లాంటి కార్యక్రమంతో ప్రతి ఒక్కరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆయ న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్వ దేవాదాయ కమిషనర్లు ముక్తేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు వారి సతీమణులు కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారు.